పవన్ కళ్యాన్ ఓ జోకర్ అన్న కమాల్..!

పని పాటా లేని కొంతమంది కేవలం అవతల వారి మీద విమర్శలు చేయడానికే చూస్తుంటారు. కేవలం జనాల్లో నానడం కోసమే స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ ఉండటం వారి పని.. సౌత్ లో ఈ జాబితాలో ఉన్నవారి సంగతి అటుంచితే బాలీవుడ్ లో తానో గొప్ప విమర్శకుడిని అయిన ఫీల్ అయ్యే ఓ ప్రభుద్ధుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

పవన్ కళ్యాన్ ఓ జోకర్.. అతని సినిమాలు తాను చూడనని.. పవన్ కళ్యాన్ లాంటి వాడే హీరో అయితే ప్రపంచంలో ఎవ్వరైనా హీరో కావొచ్చు అని పిచ్చి కూతలు కూస్తున్నాడు కమాల్ ఆర్.ఖాన్. సౌత్ ఇండియా జనాలకు ఏమైంది? సినిమాల్లో ఈ కార్టూన్ ను వాళ్లెలా చూస్తారు? వెరీ బ్యాడ్ చాయిస్. నేనైతే ఈ జోకర్ సినిమా బదులు రాజ్ పల్ యాదవ్ (బాలీవుడ్ కమెడియన్) సినిమాలు చూస్తా” అంటూ ట్వీట్స్ చేసాడు. తానో పెద్ద విమర్శకుడు అని ఫీల్ అవ్వడం తప్ప కనీసం బాలీవుడ్ లో తనని ఎవరు లెక్క చేయరనే విషయం తెలుసుకోలేని మూర్ఖుడు. అయితే ఇప్పుడు మన వాడి కన్ను సర్దార్ గబ్బర్ సింగ్ అదేనండి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మీద పడ్డది. పవన్ కళ్యాన్ సర్దార్ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాన్ మీద అతని ఫ్యాన్స్ మీద ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చేశాడు కమాల్ ఆర్.ఖాన్.

మరి కమాల్ ఆర్.ఖాన్ చేసిన ఈ స్టేట్మెంట్ కు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. బాహుబలి రిలీజ్ టైంలో కూడా ప్రభాస్, రానాల గురించి కూడా తన విమర్శలను కురిపించాడు కమాల్. పవర్ స్టార్ జోలికి వస్తే పవన్ వీరాభిమానులైన పరిశ్రమ వ్యక్తులే వారి పని పట్టడం ఖాయం. పాపం కమాల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒంగోలు లోక్‌సభ రివ్యూ : డబ్బుతొ గెలిచేస్తానని చెవిరెడ్డి లెక్కలు

ఒంగోలు ఎంపీ సీటు హాట్ కేకులా మారింది. ఆగర్భ శ్రీమంతుడైన మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తూండగా.. ఎన్నికల అఫిడవిట్‌లోనూ పెద్దగా ఆస్తులు,. ఆదాయం చూపించలేని చెవిరెడ్డి భాస్కర్...

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ను ఓడిస్తే రేవంత్ ను ఓడించినట్లే !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో విపక్షాల రాజకీయం రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. ఆయనను దెబ్బకొట్టాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. సొంత నియోజకవర్గం అయిన మహబూబ్ నగర్ లోక్ సభలో ఓడిస్తే ఆయనకు...

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఊబిలో కూరుకుపోయిన వైసీపీ !

ఏపీ ఎన్నికలకు ఎజెండా సెట్ అయిపోయింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా విపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ఈ అంశంపై మొదట్లో పెద్దగా...

ఏంటో ఈసీకి కూడా సీఐడీనే కనిపిస్తోందా ?

ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం పొందుతున్న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ లో తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close