కేసీఆర్‌కు రాహుల్ అంటే భయమంటున్న వీహెచ్

హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం ఎట్టకేలకు తెలంగాణలో 15,000 ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టినట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారం చేపట్టగానే లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తానని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన కేసీఆర్, మొత్తానికి ఎంతో కొంత ఉద్యోగాల భర్తీ మొదలుపెట్టారని నిరుద్యోగులు ఆనందపడుతుండగా, ఇదంతా తమ ఘనతేనని చెప్పుకొస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో పర్యటించబోతున్నారని తెలిసి కేసీఆర్ భయంతో ఉద్యోగాల భర్తీ ప్రకటన చేశారని వీహెచ్ వ్యాఖ్యానం. ఓయూ విద్యార్థులకు న్యాయం జరిగేవరకు కాంగ్రెస్ వారికి అండగా ఉంటుందని చెప్పారు. 15 వేల ఉద్యోగాలతోనే సరిపుచ్చుతామంటే కుదరదని, లక్ష ఉద్యోగాలను భర్తీ చేసేవరకు ప్రభుత్వం వెంటపడతామని హెచ్చరించారు. అంతా బాగానే ఉందిగానీ రాహుల్ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తానన్నది ఎప్పుడో వీహెచ్ చెప్పలేదు. గత మే నెలలో చేసిన రైతు భరోసా పాదయాత్ర సందర్భంగా రాహుల్ యూనివర్సిటీ క్యాంపస్ కూడా వెళ్ళి రాత్రి అక్కడే బస చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ అక్కడ గొడవలేమైనా జరుగుతాయేమోనని మళ్ళీ దానిని రద్దు చేశారు. మరి ఇప్పుడు వీహెచ్ చెబుతున్నది ఏనాటి రాహుల్ పర్యటన గురించో అర్థంకావటంలేదు.

మరోవైపు, ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ మాటలు నమ్మి శిక్షణకోసం నిరుద్యోగులు ఉన్నదంతా ఖర్చు చేశారని బీసీ యువజనసంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో మొత్తం 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటి భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని నోటిఫికేషన్లూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలోనే అని ముందు చెప్పి దానికి తిలోదకాలిచ్చినట్లు స్పష్టమవుతోందని ఆరోపిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దటీజ్ పవన్ – ముద్రగడకు గౌరవం !

కుటుంబాల్లో చిచ్చు పెట్టడం వైసీపీ రాజకీయవ్యూహంలో ఒకటి. రామోజీరావు కుటుంబం నుంచి దేవినేని ఉమ కుటుంబం వరకూ ఎక్కడ చాన్స్ వచ్చినా వదిలి పెట్టలేదు. కానీ జనసేన చీఫ్ పవన్...

జగన్‌పై సీఐడీ కేసు పెట్టక తప్పదా !?

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారని మల్లాది విష్ణు ఫిర్యాదు చేస్తే వెంటనే సీఐడీలోని ఫలానా అధికారి విచారించాలని సీఈవో కార్యాలయం నుంచి ...

ఈసీ ఫెయిల్యూర్ – పోస్టల్ బ్యాలెట్స్ ఇలానా ?

ఏపీ ఎన్నికల సంఘం పనితీరు అత్యంత ఘోరంగా ఉంది. కనీసం పోస్టల్ ఓటింగ్ ను సరైన పద్దతిలో నిర్వహించడం కూడా చేత కాలేదు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ స్మూత్ నిర్వహించడానికి...

‘హీరామండి’ వెబ్ సిరిస్ రివ్యూ: నయనానందమే కానీ…

Heeramandi Web Series Review సంజయ్ లీలా భన్సాలీ.. ఇండియన్ సినిమాలో పరిచయం అవసరం లేని దర్శకుడు. భారీదనం ఉట్టిపడే కళాత్మక చిత్రాలతో పేరుతెచ్చున ఆయన ఇప్పుడు వెబ్ వరల్డ్ లోకి అడుగుపెట్టారు. ఆయన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close