నిహారిక సినిమా.. భ‌లే డ‌బ్బులొచ్చాయ్‌

ఈరోజుల్లో డ‌బ్బులొచ్చిన సినిమానే హిట్ కింద లెక్క‌. విడుద‌ల‌కు ముందే లాభాలు తెచ్చుకొంటే అది సూప‌ర్ హిట్టే. ఆ లెక్క‌న‌…. ఒక మ‌న‌సు బంప‌ర్ హిట్ అయిపోయింద‌నుకోవొచ్చు. నాగ‌శౌర్య – నిహారిక జంట‌గా న‌టించిన సినిమా ఇది. రామ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మెగా హీరోయిన్ నిహారిక తొలి సినిమా కాబ‌ట్టి.. ఒక మ‌న‌సుపై దృష్టి పెట్టారంతా. సినిమా ఎలా ఉన్నా నిహారిక కోస‌మైనా చూస్తారులే… అన్న న‌మ్మ‌కం క‌లిగింది. అందుకే.. ఈసినిమా మంచి రేటుకే అమ్ముడుపోయింది. మొత్త‌మ్మీద ఈ సినిమాకి దాదాపు మూడున్న‌ర కోట్ల టేబుల్ ప్రాఫిట్ ద‌క్కింద‌ని తెలుస్తోంది. కోటిన్న‌ర‌లో తీసిన ఈ సినిమా రూ.5 కోట్ల వ‌ర‌కూ బిజినెస్ జ‌రుపుకొంది. నిజంగా ఇది మామూలు ప్రాఫిట్ కాదు. ఒక‌టికి మూడురెట్ల లాభ‌మ‌న్న‌మాట‌.

రామ‌రాజు సినిమా… మ‌ల్లెల తీరంలో సిరిమ‌ల్లెపువ్వు సినిమా శాటిలైట్ ఇంకా జ‌ర‌గ‌లేదు. ఒక మ‌న‌సుతో ఆ పాత సినిమా శాటిలైట్ సేల్ చేసేశార‌ని టాక్‌. ఒన్ ప్ల‌న్ ఒన్ కాబ‌ట్టి.. శాటిలైట్ కి మంచి రేటు ద‌క్కింద‌ని తెలుస్తోంది. తొలి సినిమాకే నిర్మాత‌ల‌కు లాభాలు మిగిల్చింది మెగా హీరోయిన్‌. ఈ సినిమా యావ‌రేజ్‌గా న‌డిచినా.. నిహారిక చుట్టూ నిర్మాత‌లు మూగిపోవ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాగ‌శౌర్య‌కు ఏమైంది..?

టాలీవుడ్ లో హీరోలంతా య‌మా బిజీగా ఉన్న ద‌శ ఇది. చేతిలో ఒక‌టీ అరా విజ‌యాలు ఉన్న 'యావ‌రేజ్' హీరోలు సైతం.. త‌మ ఆధిప‌త్యం చూపిస్తున్నారు. చేతి నిండా సినిమాల‌తో హ‌డావుడి చేస్తున్నారు....

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close