విశాఖలోని రామానాయుడు స్టూడియో భూములను ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్న వైనం, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ గా మార్చి విల్లాలు కడుతున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం భూముల్ని ఎందుకు వెనక్కి తీసుకోకూడదో చెప్పాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ షోకాజ్ నోటీసులపై రామానాయుడు స్టూడియో యాజమాన్యం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే నోటీసులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు.
ఓ సారి టీడీపీ ఎంపీగా బాపట్ల నుంచి గెలిచిన రామానాయుడు.. రెండో సారి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలనో.. రాజకీయాలను విరమించుకోవాలనో కానీ..రామానాయుడు స్టూడియోకు విశాఖలో వైఎస్ హయాంలో భూములు కేటాయించారు. సినిమా స్టూడియోకు మాత్రమే ఓ కొండపై ముఫ్పై ఎకరాలకుపైగా కేటాయించారు. అయితే అందులో సగం స్థలంలో మాత్రమే స్టూడియో నిర్మించారు. మిగతా స్థలం ఖాళీగా ఉంది. జగన్ సీఎం అయిన వెంటనే ఆ స్థలాన్ని అనధికారికంగా తీసుకున్నారని చెబుతున్నారు. అక్కడ విల్లాల నిర్మాణం ప్రారంభించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ స్థలాన్ని రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ వ్యవహారం.. ్లా కొనసాగుతూండగా.. ప్రభుత్వం మారింది. ప్రభుత్వం ఈ భూముల వ్యవహారంపై పరిశీలన జరిపి.. ఇచ్చిన పర్పస్కు కాకుండా భూముల్ని ఇతర అవసరాలకు వాడుకుంటున్నారని చెప్పి ఎందుకు రద్దు చేయకూడదో నోటీసులు జారీ చేసింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లినా ఈరట దక్కలేదు. త్వరలో .. అధికారిక ప్రకియను పూర్తి చేసి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.