వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఇంపార్టెంట్ ప్రెస్మీట్లో మాట్లాడతారని వైసీపీ నేతలు హడావుడి చేశారు. సోషల్ మీడియాలో పోస్టర్లు వేశారు. అయితే ఎప్పుడు ప్రెస్మీట్ పెట్టినా ఒకటే స్క్రిప్ట్ ఉంటుందని ఈ సారి ఏమైనా కొత్తగా ఉంటుందా అని చాలా మంది సెటైర్లు వేసుకున్నారు. వారి సందేహాలు నిజమే. ప్రభుత్వం ఏర్పడిన తరవాత మొదటి రోజున ప్రెస్మీట్ పెట్టి ఏం మాట్లాడారో.. ఇప్పుడూ అదే మాట్లాడారు. అయితే ఏడాది అయింది కాబట్టి ఫలితాలు వచ్చిన రోజున వెన్నుపోటు దినం నిర్వహిస్తమిని చెప్పుకొచ్చారు. ఎవరైనా ప్రమాణ స్వీకారం చేసిన రోజును అలా చెప్పుకుంటారు.కానీ జగన్ రెడ్డి లెక్కలు వేరు. ప్రజల్ని నిందించే ఆయన తనకు వెన్నుపోటు పొడిచారని ఇలా ప్లాన్ చేసుకున్నారు.
ప్రభుత్వం గురించి, హామీల గురించి ఎప్పుడూ చెప్పే విషయాలు చెప్పారు అదే సమయంలో తనను ఎప్పుడైనా అరెస్టు చేస్తారని బిక్కుబిక్కుమంటున్న లిక్కర్ కేసుపై స్పందించారు. అసలు అందులో స్కామే లేదని తన తీర్పు ప్రకటించేశారు. తాను రేట్లు పెంచి మద్యం అమ్మకాలను తగ్గించానని చెప్పుకొచ్చారు. ఆఫీసర్లు సిన్సియర్ అని.. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి గురించి చెప్పుకొచ్చారు. సీఎంవోకు ఒక్క ఫైల్ రాలేదని.. ఒక్క సంతకం చేసినట్లుగా నిరూపించాలని సవాల్ చేశారు. సంతకాలు లేకపోతే బయటపడిపోతానని అతి తెలివితో ముందుగానే ఆయన బకరాల్ని పెట్టుకుని కథ నడిపించారని కళ్ల ముందే కనిపిస్తోంది. సీఐడీ కోర్టుల ముందు చెబుతోంది.
లిక్కర్ స్కాం విషయంలో బాలాజీ గోవిందప్ప తన కంపెనీ ఉద్యోగి కాదని అంటున్నారు. రాజ్ కసిరెడ్డి టీడీపీ ఎంపీతో కలిసి వ్యాపారాలు చేస్తున్నాడు కాబట్టి.. ఇప్పుడు టీడీపీ మనిషంటున్నారు. ఇతర నిందితులతో తనకు సంబంధం లేదంటున్నారు..తన వద్ద పపని చేసిన వారిని మాత్రం నిజాయితీపరులని వారికి లిక్కర్ స్కాంకు సంబంధం లేదంటున్నారు. ఇక విజయసాయిరెడ్డిని అయితే చంద్రబాబు ఖాతాలో వేశారు. ఆయన చంద్రబాబుకు లొంగిపోయాడని .. ఆయయనన స్టేట్మెంట్కు విలువ ఏముందని చెప్పుకొచ్చారు. లిక్కర్ స్కాంలో ఆయన వాదన. ప్రయాస చూసి ఎదుట కూర్చున్న ప్రో జర్నలిస్టులు కూడా పాపం అనుకుంటున్నారు.
కొసమెరుపేమిటంటే.. డబ్బుల్లేక తాను పార్టీ నడపడానికి ఇబ్బందులు పడుతున్నారట. ఎన్నికలకు ముందు వరకూ తన పార్టీ అకౌంట్లో దాదాపుగా పదకొండు వందల కోట్లు ఉండేవి. పార్టీని ఎక్కడ లాగేసుకుంటారోనని భయటపడి అకౌంట్ ఖాళీ చేయించారు. ఆ డబ్బులన్నీ ఎక్కడకి తరలించారో కానీ అప్పుడే బీద అరుపులు ప్రారంభించారు.