పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతి జింతా .. తన వ్యాపార భాగస్వాములు, ఐపీఎల్ సహయజమానులపై కోర్టులో పిటిషన్ వేసింది. అక్రమంగా మరో వ్యక్తిని పంజాబ్ కింగ్స్ లో డైరక్టర్ గా చేర్చారని ఆ నియామకాన్ని రద్దు చేయాలని ప్రీతి జింతా ఆ పిటిషన్ లో కోర్టును కోరారు. ప్రతివాదుల్లో నెస్ వాడియా కూడా ఉన్నారు. నెస్ వాడియా, ప్రీతి జింతా మాజీ లవర్స్.
వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్న సమయంలో ఐపీఎల్ ఆవిర్భవించింది. దీంతో ఇద్దరితో పాటు మరికొందరు కలిసి పంజాబ్ టీముని కొనుగోలు చేశారు. ప్లేయర్ల ఆక్షన్ జరిగేటప్పుడు నెస్ వాడియాకు ప్రీతి జింతా జీడిపప్పులు తినిపిస్తూ కెమెరాకు చిక్కారు. వారి మధ్య అంత అనుబంధం ఉండేది.కానీ తర్వాత ఏమయిందో కానీ విడిపోయారు. కానీ వ్యాపారంలో భాగస్వామ్యం మాత్రం అలా కొనసాగుతోంది. గతంలోనూ కేసులు పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ ప్రీతి జింతా కోర్టులకు వెళ్తున్నారు.
పంజాబ్ కింగ్స్ చాలా కాలం తర్వాత ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఇలాంటి సమయంలో ఆ టీమ్ ఓనర్ల మధ్య వివాదాలు ప్రారంభమయ్యాయి. చివరికి ఇవి ఏ దశకు వెళ్తాయో కానీ.. ప్రతీ జింతా మాత్రం నెస్ వాడియాను కోర్టుకు లాగడం ఖాయంగా కనిపిస్తోంది. మరో నటి జూహీ చావ్లా కూడా షారుఖ్ తో కలిసి కోల్ కతా టీంను కొనుగోలు చేశారు. వారి మధ్య వివాదాల్లేవు. సింపుల్ గా టీమ్‌ను నడిపించుకుంటున్నారు.