సీనియర్ హీరో రాజశేఖర్ కెరీర్ ని మళ్లీ కొత్తగా క్రేజీ ప్రాజెక్టులతో ప్లాన్ చేస్తున్నారు. తమిళ సినిమా లబ్బర్ పంతు రీమేక్ రైట్స్ కొన్నారు. ఆయనే ప్రధాన పాత్ర పోషించేలా స్క్రిప్ట్ పనులు చేయిస్తున్నారు. అలాగే విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్ సినిమాలో ఒక పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. అలాగే తను హీరోగా పవన్ సాదినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి మగాడు అనే టైటిల్ లాక్ చేశారని తెలుస్తోంది.
మగాడు రాజశేఖర్ కెరీర్ లో సూపర్ హిట్ సినిమా. రాజశేఖర్ కి చాలా క్రేజ్ తీసుకొచ్చిన సినిమా. ఈ సినిమాతో రాజశేఖర్ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నారు. అలాంటి టైటిల్ తో మళ్ళీ ఒక సినిమా చేయడం కచ్చితంగా క్రేజీ ఫ్యాక్టర్.
గరుడవేగ సినిమాతో రాజశేఖర్ కెరీర్ కి ఒక కొత్త జోష్ వచ్చింది. అయితే అది కంటిన్యూ కాలేదు. కల్కి సినిమా టేకింగ్ పరంగా బాగున్నప్పటికీ అనుకున్నంత రీచ్ రాలేదు. నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లో ఒక క్యారెక్టర్ చేసినప్పటికీ అది కూడా అంతా హైప్ తీసుకురాలేదు. దీంతో కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్నాయన ఇప్పుడు వరుసగా మళ్లీ క్రేజీ ప్రాజెక్ట్స్ చేయడానికి రెడీ అవుతున్నారు.