టీవీ5 సీఈవో మూర్తిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. సినీ నటుడు ధర్మ మహేష్, గౌతమి చౌదరి దంపతుల మధ్య ఏర్పడిన వివాదాలను మీడియాకు ఎక్కించుకున్నారు. గౌతమి చౌదరి ఎలక్ట్రానిక్ మీడియాకు, సోషల్ మీడియాకు కావాల్సిన మసాలాను ఇస్తూ న్యూస్ ను పెంచుకుంటూ పోయారు. ధర్మ మహేష్ కూడా మరో వైపు మీడియా నుంచి తన వాదనలు వినిపించారు. కొన్ని చానళ్లు ఇంతకు మించిన సమస్య లేదన్నట్లుగా వ్యవహరించాయి. అందులో టీవీ5ఒకటి. సీఈవో మూర్తి స్వయంగా ఇన్వాల్వ్ అయ్యారు.
గౌతమి, మూర్తి సహాయంతో మాదాపూర్ పోలీసులకు మహేశ్‌పై ఫిర్యాదు చేసింది. అయితే, మహేశ్ సోమవారం మూర్తి మీద ఫిర్యాదు చేశారు. మూర్తి తన ఫోన్ ట్యాప్ చేసి, స్పై కెమెరాలతో వీడియోలు తీసి, రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గౌతమి, మూర్తిపై కేసు నమోదు చేశారు.ఇక్కడ మూర్తి రూ. పది కోట్లు అడిగారంటే ఎవరూ నమ్మరు. కానీ ఈ వివాదంలో ఆయన ఇరుక్కుపోయారంటే ఎవరూ పెద్దగా ఆశ్చర్యం వ్యక్తం చేయరు.
వాళ్ల కుటుంబసమస్యలో.. మూర్తి ఓ వైపు తీసుకుని ధర్మ మహేష్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు.దానికి మీడియా కలరింగ్ ఇచ్చారు. కుటుంబసమస్యను ఇలా మీడియాకు ఎక్కించి దాని ద్వారా టీఆర్పీ రేటింగులు పొందాలని అనుకున్నారు .కానీ ఇప్పుడు కేసుల పాలయ్యారు.