ముంబై వంటి అత్యంత ఖరీదైన నగరంలో మామూలు ఇళ్లు ..మూడుకోట్ల పైనే ఉంటాయి. ఏరియాను బట్టిఇంకా ఎక్కువ ఉంటాయి. కానీ ముంబైలో ఓ ప్రాంతంలో మాత్రం రూ.కోటికి కూడా ఇళ్లు లభిస్తున్నాయి. వెస్టర్న్ సబర్బ్స్లో కొన్ని ప్రాంతాల్లో రూ.1 కోటి బడ్జెట్‌తో ఇంకా చిన్న ఫ్లాట్ కొనుగోలు చేసుకోవచ్చు.
కందివలి వెస్ట్ ముంబైలోని అత్యంత చవకైన ప్రదేశంగా ఉంది. ఈ ప్రాంతంలో చదరపు అడుగుకు సగటు ధర రూ.21 వేల నుంచి రూ.28 వేల వరకు ఉంటుంది. రూ.1 కోటి బడ్జెట్‌తో సుమారు 475 చదరపు అడుగుల ఫ్లాట్ పొందవచ్చునని రియల్ ఎస్టేట్ నిపుణలు అంచనా వేశారు. గ్రేటర్ ముంబైలో సగటు చదరపు అడుగు ధర రూ.32 వేలకుపైనే ఉంది. దహీసర్ నుంచి వైల్ పార్ల్ వరకు కాస్త తక్కువ ఉంటాయి.
కందివలి వెస్ట్‌లో ఈ అఫర్డబిలిటీకి కారణాలు ఏమిటంటే, ఇక్కడ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ స్థిరంగా జరుగుతోంది. మెట్రో లైన్లు అందుబాటులో ఉన్నాయి. కార్పొరేట్ పార్కులు, రిటైల్ హబ్‌లు ఉన్నాయి. ముంబై మార్కెట్లో ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం, డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పటికీ సప్లై పరిమితంగా ఉంది. కందివలి వెస్ట్ వంటి ప్రాంతాలు మొదటి తరం కొనుగోలుదారులకు ఇంకా ఆకర్షణీయంగా ఉన్నాయి.
దేశంలో ముంబై అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్ గా మారుతోంది. అక్కడ ఎంత పెద్ద కోటీశ్వరులైనా అపార్టుమెంట్లలో ఉండాల్సిందే.


