పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న పోలీసు అధికారి సతీష్ హత్య జరిగినప్పటి నుండి ఆత్మహత్య అని రుద్దడానికి వైసీపీ నేతలు, సాక్షి మీడియా చేయని ప్రయత్నం లేదు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపినప్పుడు ఎలా అయితే తప్పుడు ప్రచారం చేశారో అదే ఫార్ములాతో తప్పుడు ప్రచారం చేశారు. కానీ పోలీసులు విషయాన్ని బయటకు లాగుతున్నారు. ఇప్పుడు వైసీపీకి చాలా అనుమానాలు చేస్తూ తెరపైకి వస్తోంది. ఇది కూడా వైఎస్ వివేకాది హత్య అని బయటపడిన తర్వాత ఎలా అయితే తప్పుడు ప్రచారం చేశారో అచ్చంగా అలాగే.
సతీష్ అసహజ మరణంపై హైకోర్టు విస్మయానికి గురైంది. ఆ విషయం తెలిసి తాము ఆందోళన చెందామని.. మిగతా సాక్షులతో పాటు నిందితుడు రవికుమార్ కు కూడా భద్రత కల్పించాలని ఆదేశించింది. అలాగే సతీష్ కుమార్ మృతి కేసును కూడా సీఐడీ ఏడీజీ దర్యాప్తు చేసేందుకు అంగీకరించింది. ఇప్పటికే సతీష్ కుమార్ ది హత్య అని తేలిపోయింది. హత్య చేసిస .. వెళ్తున్న ట్రైన్ నుంచి తోసేసేశారని నిర్దారించారు. పోలీసులు చురుకుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇప్పుడు కొత్తగా పేర్ని నాని ప్రెస్మీట్ పెట్టి చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. సతీష్ కుమార్ భార్య ఫోన్ కూడా లాగేసుకున్నారని అదెక్కడ ఉందని అడుగుతున్నారు. పేర్ని నాని డౌట్స్ చూస్తే.. దర్యాప్తులో చాలా వేగంగా వైసీపీ కూడా జోక్యం చేసుకుని దేని కోసమో ప్రయత్నాలు చేసిందని అర్థమవుతుంది. ఇష్టం వచ్చినట్లుగా సాక్షుల మరణాలు సంభవిస్తే అనుమానం నిందితులపైకే వస్తుందని.. తప్పుడు ప్రచారాలు చేసిన వారిపైనా అనుమానం ఉంటుందని గుర్తించలేకపోతున్నారు.


