ఇప్పుడు ఇండియాలో .. హైసర్కిల్స్లో ఎక్కువ హాట్ టాపిక్ అవుతోంది రాజ్ మంతెన కుమార్తె పెళ్లి. ఉదయ్ పూర్లోని లీలా ప్యాలెస్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేస్తున్నారు రాజ్ మంతెన. ఒక్క డాన్స్ చేస్తే కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీలు అంతా వచ్చి సంగీత్ లో డాన్స్ చేశారు. పెళ్లి కోసం ట్రంప్ కుమారుడు అమెరికా నుంచి అతిధిగా వచ్చారు. అసలు బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు అల్లుడు అయన.
రాజ్ మంతెన చదువుకనే సమయంలోనే అమెరికా వెళ్లిపోయి అక్కడే ఫార్మా కంపెనీలు పెట్టారు. ఇతర బిజినెస్లు చేసి బాగా సంపాదించారు. ఈ క్రమంలో ట్రంప్ కుటుంబంతోనూ వ్యాపారలావాదేవీలు ఉన్నట్లుగా చెబుతున్నారు.. ఆయన తన కుమార్తె పెళ్లిని మరో రాజుకే ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. ఆ పెళ్లిని ఉదయ్ పూర్ లో నిర్వహిస్తున్నారు. గోకరాజు గంగరాజు మేనల్లుడు అయిన రాజ్ మంతెన.. గంగరాజు కుమార్తెను పెళ్లి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కునుమూరి బాపిరాజు, రఘురామకృష్ణరాజులకూ బంధువేనని చెబుతున్నారు.
ఆయనకు ఇండియాలో పెద్దగా వ్యాపారాల్లేవు. అమెరికా బేస్డ్ గానే ఉన్నారు. అందుకే ఆయన చాలా ఘనంగా కుమార్తె పెళ్లికి ఖర్చు పెడుతున్నారు కానీ.. అది ఏపీలో హాట్ టాపిక్ కాకుండా చూసుకున్నారు. కానీ బాలీవుడ్ స్టార్ల డాన్సులు, ట్రంప్ కుమారుడు కూడా రావడంతో.. ఒక్క సారి పెళ్లి హైలెట్ అవుతోంది.