డైరెక్టర్ మారుతి ఎన్టీఆర్ ఫాన్స్ కి సారీ చెప్పారు. ప్రభాస్ ‘ది రాజాసాబ్’ నుంచి ‘రెబల్ సాబ్’ అనే పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ.. ‘సినిమా గురించి అందరిలా నేను కాలర్ ఎగరేసి చెప్పను’ అనే కామెంట్ చేశారు. ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ఫాన్స్ ని హార్ట్ చేసింది. ఎన్టీఆర్ వార్ 2 సమయంలో మాట్లాడిన వీడియోలని జత చేసి మారుతిని తప్పుపట్టారు ఫ్యాన్స్. ఈ విషయాన్ని గ్రహించిన మారుతి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
‘ప్రతి అభిమానికి హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నాను. ఎవరికైనా నొప్పించటం, అవమానించటం నా ఉద్దేశ్యం కాదు. కొన్ని సార్లు మాట్లాడుతున్న ప్రవాహంలో మాటలు మనం అనుకున్న విధంగా రాకపోవచ్చు. అదే ఇక్కడ జరిగింది. దానివల్ల తప్పుగా అర్ధం చేసుకున్నందుకు నిజంగా చింతిస్తున్నాను.
ఎన్టీఆర్ గారిపట్ల నాకు ఉన్న గౌరవం అమితమైనది. అలాగే ఆయన అభిమానుల ప్రేమ, వారి అంకితభావంపై నాకు ఎంతో గౌరవం ఉంది. ఈ సందేశాన్ని పూర్తిగా నిజాయితీగా రాస్తున్నాను. ఈ విషయాన్ని మీరు అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను.’ అని తన పోస్ట్ లో రాసుకొచ్చారు.
కాకపోతే.. ఇప్పటికే ఈ కామెంట్స్ అభిమానులని బాధించాయి. మాట అనే ముందు అలోచించుకోవాలి కానీ ఇలా మాటతూలి ఒకరిని భాదించిన తర్వాత క్షమాపణలు కోరడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. నిజానికి మారుతి ఇలాంటి వివాదాలకు జోలికి వెళ్ళే దర్శకుడు కాదు. ఆయన ఏం చెప్పాలనుకున్నారో కానీ ‘కాలర్’ కామెంట్ వచ్చేసింది. మరి ఈ వివాదం సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.