ఈవారం విడుదలైన ‘అఖండ 2’ చిత్రానికి బాక్సాఫీసు దగ్గర అనూహ్య స్పందన లభిస్తోంది. తొలివారాంతం వసూళ్ల పట్ల చిత్రబృందం సంతోషంగా వుంది. నైజాంలో తొలి మూడు రోజులకే 70 శాతం రికవరీ సాధించినట్టు దిల్ రాజు ప్రకటించారు. సోమవారం నుంచి కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని నిర్మాతలు ఆశతో ఉన్నారు. మరోవైపు ప్రచారాన్ని కూడా ఉధృతం చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ కోసం ప్రత్యేకంగా ప్రదర్శింబోతున్నారు. ఈ విషయాన్ని `అఖండ 2` సక్సెస్ మీట్ లో దర్శకుడు బోయపాటి శ్రీను ప్రకటించారు. అఖండ గురించి ప్రధాని మోదీ తెలుసుకొన్నారని, త్వరలోనే ఆయను ఈ సినిమా చూపిస్తామని చెప్పుకొచ్చారు బోయపాటి ఈవారం లోనే ఈ ప్రత్యేక ప్రదర్శన ఉండబోతోందని సమాచారం. ప్రధాని తో పాటు కొంతమంది కేంద్ర మంత్రులు ఈ చిత్రాన్ని వీక్షించే అవకాశం ఉంది. దాంతో ‘అఖండ 2’కి మరింత ప్రచారం లభిస్తుంది. రెండో వారం వసూళ్లు బలంగా ఉండడానికి ఈ ప్రమోషన్ దోహదపడుతుంది కూడా. సనాతన ధర్మం, హిందుత్వం, దేశం… వీటికి సంబంధించిన అంశాల్ని ఈ చిత్రంలో బోయపాటి శ్రీను బలంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఆ అంశాలు నార్త్ ఆడియన్స్ కి కూడా నచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా చూశాక.. ప్రధాని తన అనుభావాల్ని పంచుకొంటే, ఈ సినిమా ప్రేక్షకులకు మరింత చేరువయ్యే అవకాశం ఉంది.
డిసెంబరు 19న ‘అవతార్ 3’ రాబోతోంది. అవతార్ ప్రభావం ‘అఖండ 2’పై తప్పకుండా ఉంటుంది. అయితే అది మల్టీప్లెక్స్ వరకే. బీ,సీ సెంటర్లలో అఖండకు ఇంకా చోటుంది. రెండోవారం నుంచి కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వస్తే… అఖండ లాంగ్ రన్ తీసుకొనే అవకాశం వుంది. దిల్ రాజు చెప్పినట్టు నైజాంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు దగ్గరైంది. అన్ని ఏరియాల్లోనూ అది జరగాలంటే రెండో వారం వసూళ్లు చాలా కీలకం


