టీ ఆర్ ఎస్ లోకి అలనాటి హీరోయిన్

ముత్యాల ముగ్గు సినిమాని ఎవ్వరూ మ‌ర్చిపోలేరు. అల‌నాటి ఆ క్లాసిక్‌లో న‌టించిన సంగీత కూడా మ‌న జ్ఞాప‌కాల పొర‌ల్లో ప‌దిలంగా ఉంటుంది. దాదాపు 600 చిత్రాల్లో న‌టించిన సంగీత చాలా కాలంగా తెలుగు సినిమాల‌కు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆమె చెన్నై నుంచి హైద‌రాబాద్‌కి వచ్చారు. ఇక నుంచి తెలుగులో స‌రికొత్త ఇన్నింగ్స్ మొద‌లెడ‌తాన‌ని, త‌న‌కు త‌గిన పాత్రలొస్తే న‌టించ‌డానికి సిద్దమే అని ప్రక‌టించారామె. అంతే కాదు. రాజ‌కీయాల్లో చేరాల‌న్న అభిలాష వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ప‌నితీరు అద్భుతంగా ఉంద‌ని, అందుకే టీఆర్ ఎస్ పార్టీలో చేర‌తాన‌ని, త్వర‌లోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ని మ‌ర్యాద పూర్వకంగా క‌లుసుకొంటాన‌ని చెప్పారామె.

అయితే ఈ వ‌య‌సులో రాజ‌కీయాల్లో చేర‌డం ప‌ద‌వుల్ని ఆశించి కాద‌ని, ప్రత్యక్షంగా సినిమా రంగానికి సేవ చేయాల‌న్న ఆకాంక్షతోనే రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా.. అన్నారు. ఇంత‌కీ సంగీత‌ది వ‌రంగ‌ల్ జిల్లానే. ఇక్కడ్నుంచి వాళ్ల కుటుంబం అప్పట్లో మ‌ద్రాస్‌వెళ్లిపోయింది. తెలుగు చిత్రసీమ మ‌ద్రాస్ నుంచి హైద‌రాబాద్‌కి వ‌చ్చిన‌ప్పుడు సంగీత కూడా కుటుంబంతో హైద‌రాబాద్ షిప్ట్ అయ్యారు. కానీ కొంత‌కాలం ఇక్కడ ఉండి.. మ‌ళ్లీ వెళ్లిపోయారు. ఇటీవ‌లే సంగీత హైద‌రాబాద్‌లో మ‌కాం మార్చారు. అమీర్ పేట్‌లోని ఓ ఫ్లాట్ తీసుకొని.. నివాసం ఉంటున్నారు. కేవ‌లం తెలుగు చిత్రసీమ‌కు ద‌గ్గర‌గా ఉండాల‌న్న ఆశ‌తోనే హైద‌రాబాద్ వ‌చ్చాన‌ని తెలిపారామె.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close