హీరోయిన్స్ న్యూడ్ …….ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నాయి…….

మన సినిమా హీరోయిన్స్ ఎవ్వరినీ కూడా అమాయకమైన లేకపోతే మామూలు అమ్మాయిలు అనే కోణంలో నుంచి అస్సలు చూడకూడదు. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ నుంచి డబ్బులు గుంజడంలో వీళ్ళు మహా ముదుర్లు. అంతేకాదు సినిమా షూటింగ్ కొంత కంప్లీట్ అయిన తర్వాత నుంచి వీళ్ళ గొంతెమ్మ కోరికలు మామూలుగా ఉండవు. వాటిని తీర్చలేక ఆస్తులమ్ముకున్న ప్రొడ్యూసర్స్ ఎందరో? సినిమా ఇండస్ట్రీలో ఉన్న తొంభై శాతం మంది హీరోయిన్స్ ఇలాంటి వాళ్ళే. దశాబ్ధం పాటు బోలెడన్ని తెలుగు సినిమాలలో యాక్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళకు తెలుగు సినిమా పరిశ్రమ అంటే కనీస గౌరవం కూడా ఉండదు. తెలుగు ప్రేక్షకులు అంటే మాకు ప్రత్యేకమైన అభిమానం అని ప్రతి సినిమా ఆడియో ఫంక్షన్‌లోనూ రొటీన్ చిలక పలుకులు పలుకుతారు కానీ అవన్నీ అబద్ధాలే అన్నది నిఖార్సయిన నిజం.

ఆ విషయాలను పక్కన పెట్టి స్కిన్ షో గురించి చర్చించుకున్నా కూడా బయట అనుకునే మాటలకు, వాస్తవాలకు అస్సలు సంబంధమే ఉండదు. ఎక్స్‌పోజింగ్ చేయమని చెప్పి హీరోయిన్స్‌ని సినిమావాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటారని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. పది శాతం హీరోయిన్స్‌ని పక్కన పెడితే మిగతా అందరు హీరోయిన్స్ కూడా ఎంత ఎక్కువగా తెరపైన అందాలు చూపిద్దామా? అని ఆరాటపడేవాళ్ళే. టాలెంట్ కంటే స్కిన్ షో పైన ఎక్కువగా డిపెండ్ అయ్యి బ్రతికేస్తున్న వాళ్ళే. ‘కోత్త బంగారు లోకం’ సినిమాతో శ్వేతా బసు ప్రసాద్‌ని తెలుగు తెరకు ఇంట్రడ్యూస్ చేశాడు దిల్ రాజు. ఫ్యామిలీ ప్రేక్షకులను ఎక్కువగా టార్గెట్ చేస్తుంటాడు దిల్ రాజు. ‘కొత్త బంగారు లోకం’ సినిమా అంతా కూడా హీరోయిన్ పద్ధతిగానే, పక్కింటి అమ్మాయిలానే కనిపిస్తుంది. సినిమాను కూడా అలాగే ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్ళాలనుకున్నారు. తీరా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కి మాత్రం శ్వేతా బసు ప్రసాద్ ఫుల్ షో చేసేలా దిమ్మతిరిగిపోయే రేంజ్ డ్రెస్‌తో వచ్చింది. ఆ డ్రెస్ చూసి షాకయిన్ దిల్ రాజు అండ్ కో వెంటనే ఆ అమ్మాయి డ్రెస్‌ని ఛేంజ్ చేయించారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా విషయంలో కూడా అంజలి హాట్ డ్రెస్ చాలా మందిని ఇబ్బంది పెట్టింది. సినిమాను తెరకెక్కిస్తున్నప్పుడు కూడా చాలా మంది హీరోయిన్స్ హాట్ హాట్‌గా కనిపించడానికి అవకాశమున్న కాస్ట్యూమ్స్‌ని డిమాండ్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ సినిమాల హీరోయిన్, ఎక్స్‌పోజింగ్‌ చేయడానికి పనికి రాదు అనే ముద్ర ఎక్కడ పడుతుందో అని అనుక్షణం భయపడుతూ ఉంటారు. అందుకే అవకాశం ఉన్నప్పుడల్లా ఎంత ఎక్కువగా ఎక్స్‌పోజ్ చేద్దామా అని తపిస్తూ ఉంటారు.

ఈ మధ్య ఓ ఇద్దరు హీరోయిన్స్ పర్సనల్ సరదా కోసం తీసుకున్న న్యూడ్ ఫొటోలు లీకయ్యాయి. ఆ ఫొటోలు నెట్‌లో వైరల్ అయ్యాయి. వెంటనే ఇద్దరూ కూడా ప్రెస్ మీట్ పెట్టేశారు. ఫొటోలు పబ్లిష్ చేసిన మీడియా వాళ్ళపైన కేసులు పెట్టేస్తామని ప్రగల్భాలు పలికారు. ఆ మధ్య ఎవడు సినిమా టైంలో శృతీ హాసన్ హాట్ ఫోటోలు లీక్ అయినప్పుడు శృతీ కూడా ఇలాగే రెచ్చిపోయింది. ఆ తర్వాత కేసు విషయం ఏమైందో తెలియదు కానీ అంతకంటే ఎక్కువ స్థాయిలో ఎక్స్‌పోజ్ చేస్తూ చాలా ఫొటోషూట్స్‌లో రెచ్చిపోయింది శృతీ హాసన్. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు హీరోయిన్స్‌ది కూడా డ్రామా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అలాగే రాధికా ఆప్టే‌ మాటలు కూడా అనుమానాస్పదంగానే ఉంటున్నాయి. రాధిక నటించిన సినిమాకు పబ్లిసిటీ తీసుకురావడం కోసమే వీడియోలు లీక్ చేశారు. అలాగే తనకు పబ్లిసిటీ అవసరమైనప్పుడల్లా మీడియాకు అవసరమైన కొంత సెన్సేషనల్ మెటీరియల్ ఇస్తూ ఉంటుంది రాధిక. సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమాలో ఉన్న ఓ ప్రముఖ హీరో గురించి అమ్మడు చెప్పిన మాటలు కూడా అలాంటివే. పొలిటికల్ ప్రత్యర్థులు వాటిని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశారు అంతే. ఇక్కడ ఆ హీరో సుద్ధపూస అని ఎవ్వరూ చెప్పడం లేదు. రాధికా ఆప్టే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా విషయాన్ని చెప్పుకోవాలి కదా. అప్పుడెప్పుడో జరిగిన విషయాన్ని రాధికా ఇప్పుడే ఎందుకు చెప్తోంది? అసలు మీడియాతో ఎందుకు చెప్తోంది? పోలీస్ కేసు ఎందుకు ఫైల్ చేయడంలేదు?

హీరోయిన్స్ న్యూడ్ ఫొటోలు, వీడియోలను వాళ్ళే ఎందుకు లీక్ చేసుకుంటారు? పబ్లిసిటీ కోసమే అయితే డైరెక్టుగా వాళ్ళే మార్కెట్‌లో రిలీజ్ చేసుకోవచ్చుగా అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అలా చేస్తే తీసుకెళ్ళి జైళ్ళో పెడతారు. పూర్వపు సన్నీలియోన్ రకం వేషాలు వేయడానికి మన చట్టాలు ఒప్పుకోవు. కానీ మన హీరోయిన్స్‌లో చాలా మంది మాత్రం సన్నీలియోన్ పాత జీవితం రేంజ్ స్టాండర్డ్స్‌కి ఎదిగిపోయారు. అందుకే క్రికెట్‌లో గెలిస్తే బట్టలిప్పేస్తాం. లో దుస్తులకు సంబంధించిన ఏదో ఇష్యూ రైజ్ అయ్యేసరికి లో దుస్తులు తీసేసి దిగిన సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేయడం….ఇంకా ఇంకా ముందుకెళ్ళడానికి, దూసుకుపోవడానికి, రెచ్చిపోవడానికి, పూర్తిగా బట్టలిప్పేయడానికి మన ఇండియన్ హీరోయిన్స్, మోడల్స్‌లో చాలా మంది రెడీగా ఉన్నారు. కాకపోతే సెన్సార్ వాళ్ళతో సమస్య వస్తోంది. అందుకే సెన్సార్ వాళ్ళను తిట్టడమంటే మహా సరదా మనవాళ్ళకు. మన హీరోయిన్స్‌కి. చట్టం అంటే కూడా భయాలు ఉన్నాయి. హీరోయిన్స్ న్యూడ్ ఫొటోస్, లీక్డ్ వీడియోల విషయంలో పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోతే, ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అవుతూనే ఉంటుందేమో అనిపిస్తోంది. ఇది కచ్చితంగా సమాజానికి క్షేమకరం అయితే కాదు. చట్టాలను రూపొందిస్తున్నవారు, అమలు చేస్తున్నవారు కూడా ఈ విషయంలో అప్‌డేట్ అవ్వాలి. ఇలాంటి వేషాలు వేస్తున్న వాళ్ళను ఎలా శిక్షించాలో ఆలోచించాలి. లేకపోతే మాత్రం ప్రపంచంలో ఎక్కడెక్కడో జరుగుతున్న సెక్స్‌కు సంబంధించిన దరిద్రాలన్నింటినీ మన ఆలోచనల్లోకి ఎక్కించేస్తున్న మన మీడియావారు… ఈ హీరోయిన్స్ న్యూడ్ ఫొటోలు, వీడియోల విషాన్ని కూడా మన మెదళ్ళలో ఎక్కించేస్తారు. ఆల్రెడీ అలాంటివి చాలా చాలా జరిగిపోతూనే ఉన్నాయి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం మన కళ్ళముందే భయంకరమైన పరిస్థితులు ఏర్పడటం ఖాయం. అప్పుడు ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న సెక్సువల్ పర్వర్ట్స్ గురించి నెట్‌లో వెతికి మరీ పబ్లిష్ చేయాల్సిన దుస్థితి మన మీడియకు ఉండదు. ఎంచక్కా భారతదేశంలో… మన కళ్ళముందు జరుగుతున్న దరిద్రాలనే పబ్లిష్ చేసుకుంటూ పండగ చేసుకోవచ్చు. మన నాయకులకు ఏ సమస్యను అయినా వెంటనే పరిష్కరించడం అస్సలు ఇష్టం ఉండదు. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకూ తెచ్చి అప్పుడు పరిష్కారం ఆలోచించే రకాలు. ఈ విషయంలో కూడా అలా చేయరని ఆశిద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

బ‌న్నీ చేతిలో ‘గాజు గ్లాసు’… ఏం సంకేతాన్ని ఇస్తోంది?

సినిమా వాళ్లు, అందులోనూ స్టార్ హీరోలు సెన్సిటీవ్‌గా ఉంటారు. తెర‌పై ఏం చేసినా, చెయ్యాల‌నుకొన్నా, ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచిస్తారు. 'ఇలా చేస్తే.. జ‌నంలోకి ఎలాంటి సంకేతాలు అందుతాయి' అనే లెక్క‌లు వాళ్ల‌కు చాలా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close