చిరుత’కు తొమ్మిదేళ్ళు….మగధీరతో చరిత్ర…..ఆ తర్వాత….?

సరిగ్గా తొమ్మిదేళ్ళ క్రితం….దశాబ్ధాలుగా తెలుగు సినీ పరిశ్రమను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతూ ఉన్న మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ ‘చిరుత’గా తెలుగు సినీ తెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. లుక్ అదిరింది. డ్యాన్స్‌లు చింపేశాడు. ఓవరాల్‌గా తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు. కర్ణుడు కవచ కుండలాలతో పుట్టినట్టుగా, హీరో అవకముందే ‘మెగా పవర్ స్టార్’ అన్న భుజకీర్తులతో తెరపైకి వచ్చిన చరణ్……. మొదటి సినిమాతోనే చిరంజీవి, పవన్ అభిమానులందరూ తనను అభిమానించేలా చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఒక్క రాత్రిలోనే చాలా పెద్ద స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత ఇక మిగిలిన టార్గెట్ నంబర్ ఒన్ హీరో అని అనిపించుకోవడమేగా. చిరంజీవిని నంబర్ ఒన్ హీరోగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన అల్లు అరవింద్ నిర్మాణ సారధ్యంలో, చిరంజీవి పర్ఫెక్ట్ ప్లానింగ్‌కి.. ఎస్.ఎస్. రాజమౌళిలాంటి ది బెస్ట్ హార్డ్ వర్కర్, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రతిభ, కృషి తోడవ్వడంతో ‘మగధీర’తో చరిత్ర సృష్టించాడు చరణ్. మొదటి సినిమా హీరో అయినా సరే….ఆ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టగలిగితే వాడే నంబర్ ఒన్ హీరో అన్న ఫిలాసఫీ మన దగ్గర చాలా మందికి ఉంటుంది కాబట్టి, అలాంటి వాళ్ళ అందరి దృష్టిలో నంబర్ ఒన్ హీరో అయిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.

అంతే…అయిపోయింది. ఆ తర్వాత ఇక చేయడానికి ఏం ఉంటుంది? సాధించేశానని రామ్ చరణ్ కూడా అనుకున్నాడు. ఆ ఫీలింగ్‌ని తలకు ఎక్కించేసుకున్నాడు. మెగా ఫ్యామిలీది కూడా సేం ఫీలింగ్. అందుకే చరణ్ స్థాయిని మర్చిపోయి భారీ బడ్జెట్‌తో ‘ఆరెంజ్’ సినిమాను తెరకెక్కించాడు నాగబాబు. మగధీరలానే ‘ఆరెంజ్’ కూడా అప్పటికి ఇండస్ట్రీ రికార్డ్ అయింది. కాకపోతే అది ఫెయిల్యూర్ రికార్డ్. ఆ దెబ్బతో ఫ్లాప్ అంటేనే భయపడే స్థాయికి వెళ్ళిపోయాడు చరణ్. అస్సలు ఓడిపోకూడదు అని ఆలోచిస్తూ, ఓటమికి అనుక్షణం భయపడుతూ ఉండేవాళ్ళు ఎప్పటికీ ఎదగలేరు. రామ్ చరణ్ విషయంలో కూడా అదే జరిగింది. రచ్చ నుంచి బ్రూస్ లీ వరకూ, మధ్యలో హిందీకి వెళ్ళి చేసిన ‘జంజీర్’తో సహా రామ్ చరణ్ నేర్చుకుంది కానీ, కనీసం లుక్స్ వైజ్ అయినా కొత్తగా ట్రై చేసింది కానీ ఏమీ లేదు. కచ్చితంగా హిట్ కొట్టాలి అని రొటీన్ మాస్ మసాలా కథలతో తను చేసిన సినిమాలన్నీ కూడా వాటిని తీసిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్…ఇంకా చాలా మందికి ఉపయోగపడ్డాయి కానీ రామ్ చరణ్‌కి మాత్రం నష్టం చేశాయి. మెగా స్టార్ ఫ్యాన్స్‌ని మినహాయిస్తే పవన్, బన్నీ ఫ్యాన్స్‌ కూడా చరణ్ సినిమాలు చూడడానికి ఇష్టపడలేదు. ఇక సినిమా లవర్స్, క్లాస్ ఆడియన్స్, ఓవర్సీస్ ఆడియన్స్ అందరికీ దూరమయ్యాడు. ఫైనల్‌గా రాజశేఖర్, సాయికుమార్‌లలాగా బి, సి థియేటర్స్‌ హీరోగా మిగిలిపోయే పరిస్థితి.

మెగాస్టార్‌తో కలిసి నటించిన బ్రూస్ లీ సినిమాకు కనీస స్థాయి ఓపెనింగ్స్ కూడా రాకపోవడం, మెగా ఫ్యాన్స్ కూడా ఆ రొటీన్, రెగ్యులర్ స్టఫ్‌ని రిజెక్ట్ చేయడంతో ఆరెంజ్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ షాక్‌ తగిలింది చరణ్‌కి. అయితే ఆరెంజ్ ఫ్లాప్‌తో ఫెయిల్యూర్‌కి భయపడి రాంగ్ ట్రాక్ ఎక్కేసిన చరణ్….ఈ సారి బ్రూస్‌ లీ దెబ్బ పడిన తర్వాత మాత్రం రైట్ ట్రాక్‌లో ఆలోచిస్తున్నాడు. రచ్చ నుంచి బ్రూస్ లీ వరకూ తను ఇచ్చిన రొటీన్ స్టఫ్ తన కెరీర్, ఇమేజ్‌కి ఎంత నష్టం చేసిందో అర్థం చేసుకున్నాడు. అందుకే ఆ స్టార్, ఈ స్టార్, నంబర్ ఒన్ స్టార్ లాంటి తెచ్చిపెట్టుకున్న భుజకీర్తులన్నింటినీ పక్కన పెట్టేసి కథలో భాగమవ్వాలని డిసైడ్ అయ్యాడు. తెరపైన కూడా మెగాస్టార్ కొడుకుగానో, నయా మెగాస్టార్‌లానో కనిపించాలనుకోకుండా నటుడిగా కనిపించాలనుకుంటున్నాడు. ఆ క్యారెక్టర్ మాత్రమే కనిపించేలా యాక్ట్ చేయాలని ట్రై చేస్తున్నాడు. అందుకే రచ్చ రచ్చ హీరోయిజం లేని కథ, మాస్ ఫ్యాన్స్ రిసీవ్ చేసుకుంటారో? లేదో? సినిమా హిట్ అవుతుందో? లేదో? అని విశ్లేషకులు, సన్నిహితులు కూడా భయపెట్టినప్పటికీ ‘థనీ ఒరువన్’ సినిమా రీమెక్‌లో నటించడానికి రెడీ అయ్యాడు రామ్ చరణ్. ఇప్పుడు చేస్తున్న ఆ ‘ధృవ’ సినిమాతో కూడా….మొదటి ప్రయత్నంలోనే చరణ్‌ని క్లాస్ అండ్ ఓవర్సీస్ ఆడియన్స్ అందరూ రిసీవ్ చేసుకుంటారు అని చెప్పలేం, కానీ కచ్చితంగా ఇదో మంచి ప్రయత్నమే. కొత్త సినిమా, మంచి సినిమా చూడాలనుకునే ప్రేక్షకులు కూడా తన సినిమాలకు రావొచ్చని ప్రేక్షకులకు ఓ మెస్సేజ్ ఇవ్వడానికి పనికొచ్చే సినిమానే. రామ్ చరణ్ అండ్ మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ కూడా వేళ్ళూ, కాళ్ళూ పెట్టకుండా ఉంటే ఆ తర్వాత చేయబోయే సుకుమార్ సినిమా ఎలాగూ కొత్తగానే ఉంటుంది. సుకుమార్ చెప్పినట్టుగా చేసుకుంటూ పోతే ఓ కొత్త రామ్ చరణ్‌ని చరణ్ కూడా తెరపైన చూసుకోవచ్చు. ప్రేక్షకులకు కూడా ఓ కొత్త సినిమాను అందించిన వాడు అవుతాడు. అలాగే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్‌లాంటి ఈ తరం హీరోలకంటే కూడా చాలా యంగర్ అయిన చరణ్…సినిమాలు చేయడంలో మాత్రం మినిమం స్పీడ్ కూడా చూపించలేకపోతున్నాడు. ఈ విషయంలో బాబాయ్ పవన్ కళ్యాణ్‌ని ఆదర్శంగా తీసుకున్నాడో ఏమో తెలియదు. అయితే పవన్ శైలి ఆయనకు మాత్రమే సొంతం. ఆ పద్ధతిని వదిలేసి ఖైది టైంలో చిరంజీవి పడిన కష్టాన్ని గుర్తు చేసుకుంటే బాగుంటుంది. చిరుత సినిమా నుంచి ఇప్పటి వరకూ కూడా అన్ని సినిమాల్లోనూ తనకు బాగా వచ్చిన డ్యాన్సింగ్ స్కిల్స్ పైనే ఎక్కువ డిపెండ్ అవుతున్నాడు చరణ్. ఇక ఇప్పుడు అందులో కొత్తదనం చూపించడానికి కూడా ఏమీ లేదు. అందుకే యాక్టింగ్ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవాలి. తన ఫ్యామిలీలోనే ఉన్న అల్లు అర్జున్‌ కష్టాన్ని, సినిమా సినిమాకు తను ఇంప్రూవ్ అవుతున్న విధానాన్ని కాస్త పరిశీలిస్తే తను ఏం మిస్సయ్యాడో……ఏం చేస్తే బాగుంటుందో అన్న విషయాలన్నీ వెంటనే అర్థమవుతాయి. ఆ రూట్ ఫాలో అయితే తెలుగు ప్రేక్షకులకు కూడా మంచి సినిమాలు అందించినవాడు అవుతాడు. ఇంకో పదేళ్ళ తర్వాత కూడా మగధీర గురించి చెప్పుకోవాల్సిన దుస్థితి తప్పుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు..!!

సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ ఫిర్యాదు ఆధారంగా ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల...

ఏపీ ఉద్యోగుల చైతన్యం – 4 లక్షలకుపైగా పోస్టల్ బ్యాలెట్స్ !

ఏపీలో పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సారి ఉద్యోగుల్లో మరింత ఎక్కువగా చైతన్యం కనిపిస్తోంది. ఎన్నికల విధులు... ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండేవారు పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకోవచ్చు....

గవర్నర్ పై లైంగిక ఆరోపణలు..!!

వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై రాజ్ భవన్ లో పని చేసే మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేసింది. ఉద్యోగం పేరిట ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ...

రిజర్వేషన్లపై కేసీఆర్ సైలెన్స్… కవిత కోసమేనా..?

దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు, రాజ్యాంగంపై రగడ కొనసాగుతోంది. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని, రాజ్యాంగం రద్దుకు మద్దతు ఇవ్వడమేనని కాంగ్రెస్ వాదిస్తుండగా.. తాము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లను ఎట్టి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close