‘నేను…శైలజ’ సినిమాకు ముందు వరకూ కూడా మాస్ హీరో అనిపించుకోవాలని చాలా చాలా ప్రయత్నాలు చేశాడు రామ్. అవన్నీ కూడా గూబ గుయ్యిమనిపించిన సినిమాలే. శివమ్ లాంటి సినిమాలకైతే కనీస స్థాయి కలెక్షన్స్ కూడా రాలేదు. ఇంచుమించుగా మళ్ళీ దేవదాసు స్టేజ్‌కి వచ్చేశాడు రామ్. ఆ తర్వాతే చాలా జాగ్రత్తగా మంచి కథ, అంతకుమించిన సీన్స్, చాలా చాలా మంచి డైలాగ్స్‌తో… రైటింగ్ వర్క్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్న ‘నేను…శైలజ’ లాంటి సినిమా చేశాడు. అది వర్కవుట్ అయింది. రామ్ మార్కెట్ రేంజ్‌ని పెంచింది. కానీ రామ్ జాగ్రత్తలన్నీ ఆ ఒక్క సినిమాకే పరిమితమైనట్టున్నాయి.
ఒక్క సూపర్ హిట్ పడగానే మళ్ళీ శివమ్ లాంటి మాస్, యాక్షన్ సినిమాకు రెడీ అయిపోయాడు. ట్రైలర్, సాంగ్స్‌తో పాటు రామ్ లుక్స్ కూడా గొప్పగా అయితే లేవు. కథ వ్యవహారం కూడా కందిరీగ, శివమ్ స్టైల్లోనే ఉన్నట్టుంది. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాని ఊరమాస్, రామ్ స్టైల్లో తీసేశారా? అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రామ్‌కి కూడా ఈ విమర్శలు వినిపించినట్టున్నాయి. వెంటనే అభిమానుల కోసం అప్పుడప్పుడూ ఇలాంటి సినిమాలు కూడా చేయాలని చెప్తున్నాడు. ఎన్టీఆర్‌లాంటి స్టార్ హీరో కూడా అభిమానులు, ఇమేజ్ లాంటి వాటిని పక్కన పెట్టి కథలో భాగమవ్వాలని, మంచి కథాబలమున్న సినిమాలు చేయాలని ఆలోచిస్తుంటే రామ్ లాంటి యంగ్ అండ్ ఎనర్జిటిక్, టాలెంటెడ్ హీరో మాత్రం అభిమానుల కోసమే ఇలాంటి రెగ్యులర్, రొటీన్ మాస్ మసాలా సినిమాలు చేయాల్సి వస్తుంది అనేలా మాట్లాడడం అస్సలు కరెక్ట్ అనిపించడం లేదు. ఈ ‘హైపర్’ యాక్షన్ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా…ఇక మీదటైనా తన ఏజ్‌కి తగ్గట్టుగా ‘నేను..శైలజ’ లాంటి మంచి సినిమాలు చేస్తే కెరీర్లో విజయాల శాతం పెరగడంతో పాటు, ఇంకాస్త మంచి స్టేజ్‌కి వెళతాడు రామ్. యాక్టింగ్ స్కిల్స్, డైలాగ్ డెలివరీ, లుక్స్ విషయంలో ఈ జెనరేషన్ యూత్ హీరోల కంటే కూడా ఒక మెట్టుపైనే ఉండే రామ్ కథల ఎంపికలో కూడా ట్రెండ్‌కి తగ్గట్టుగా ఆలోచిస్తే బాగుంటుందేమో.