ఫాన్స్ కి స్వీట్ న్యూస్ : సూర్యతో ప్రభాస్ ?

ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది నిజంగా స్వీట్ అండ్ షాకింగ్ న్యూసే. యంగ్ రెబల్ స్టార్ ని మళ్ళీ వెండితెరపై చూడాలంటే ‘బాహుబలి 2’ వచ్చే వరకూ ఆగాల్సిన పని లేదు. ఈలోగానే సిల్వర్ స్క్రీన్ పై ప్రభాస్ సందడి చేయనున్నాడు. సూర్య నటించిన చిత్రం సింగం 3. తొలి రెండు భాగాలూ సూపర్ హిట్ అయ్యాయి. త్వరలోనే పార్ట్ 3 వస్తోంది. సింగం 3 లో ప్రభాస్ కూడా కనిపించబోతున్నట్టు తెలిసింది. ఓ గెస్ట్ రోల్ కోసం తెలుగులో ఓ అగ్రహీరో కనిపిస్తే బాగుంటుందని చిత్ర బృందం భావించింది. అందులో భాగం గానే ప్రభాస్ ని సంప్రదించినట్టు తెలుస్తోంది. ప్రభాస్ కూడా అందుకు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ప్రభుదేవా సినిమా యాక్షన్ జాక్సన్ లో ప్రభాస్ గెస్ట్ అవతారం ఎత్తాడు. ఓ షాట్ లో స్టెప్ వేసి వచ్చేసాడు. మళ్ళీ గెస్ట్ రోల్ లో కనిపించడం ఇదే.

ఐతే సింగం 3 లో కనిపించడానికి రాజామౌళి పచ్చ జెండా ఊపాల్సి వుంది. సూర్య అంటే రాజమౌళి కి ప్రత్యేకమైన అభిమానం. సూర్య ఆడియో వేడుకలకు జక్కన్న కూడా హాజరు అవుతాడు. అందుకే సూర్య కోసమైనా జక్కన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయం అనిపిస్తోంది. ప్రభాస్ కనుక సింగం 3 లో ఎంట్రీ ఇస్తే ఈ సినిమా రేంజే వేరే స్థాయిలో ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close