ఓంకార్ టాలెంట్ చూసి బిత్త‌ర‌పోయిన నాగ్‌

బుల్లి తెర యాంక‌ర్‌గా ఓంకార్ సుప‌రిచితుడే. అక్క‌డ గెలిచిన ఓంకార్‌.. త‌న క్రియేటివిటీని వెండితెర‌పై చూపించాల‌నుకొన్నాడు. తొలి ప్ర‌య‌త్నంగా జీనియ‌స్ ని తీస్తే…అది కాస్త అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. కొన్నాళ్లు గ్యాప్ తీసుకొని.. ఈసారి హార‌ర్ కామెడీ అంటూ భ‌య‌పెట్టాడు. ఓంకార్ సినిమా రాజుగారి గ‌ది సూప‌ర్ హిట్ట్ అవ్వ‌డ‌మే కాదు… దాని సీక్వెల్ నాగార్జున‌తో చేసే అవ‌కాశాన్ని క‌ల్పించింది. ఇటీవ‌లే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. నాగ్ పై ఇప్ప‌టికే కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాల్ని తీసేశాడు ఓంకార్‌. వాటిని స‌ర‌దాగా క‌ట్ చేసి.. ర‌షెష్‌ని నాగ్‌కి చూపించాడ‌ట‌.అది చూసి నాగ్ బిత్త‌ర‌పోయాడ‌ని తెలుస్తోంది. `చాలా బాగా తీశావ్‌… అవుట్ పుట్ ఇలా వ‌స్తుంద‌ని ఊహించ‌లేదు. నీలో చాలా ప్ర‌తిభ ఉంది. క‌చ్చితంగా పెద్ద ద‌ర్శ‌కుడు అవుతావ్‌` అంటూ నాగ్ ఓంకార్‌కి కితాబులు ఇచ్చాడ‌ట‌. అది చూసి ఓంకార్ పొంగిపోతున్నాడ‌ని, సెట్లో ఇంకా క‌సిగా ప‌నిచేస్తున్నాడ‌ని టాక్‌. సినిమా జ‌రుగుతున్న‌ప్పుడు ఓ అంచ‌నా రావ‌డం కోసం సెట్లోనే ఎడిట్ చేసి ర‌షెష్ చూసుకోవ‌డం మామూలే. కాక‌పోతే… వాటిని హీరోకి చూపించాల‌ని ఏ ద‌ర్శ‌కుడూ అనుకోడు. ఎందుకంటే… ఎఫెక్ట్స్ లేకుండా, ర‌ఫ్‌గా ఎడిట్ చేసి చూస్తే… ఎంత గొప్ప సీన్ అయినా చ‌ప్ప‌గానే అనిపిస్తుంది. అలాంటిది.. ఓంకార్ ర‌షెష్‌ని చూపించ‌డం, దానికి నాగ్ కితాబులు ఇవ్వ‌డం.. గొప్ప విష‌య‌మే. ఫైన‌ల్ అవుట్‌పుట్ కూడా ఇలానే వ‌స్తే.. నాగ్ ఖాతాలో, ఓంకార్ ఎకౌంట్‌లో మ‌రో హిట్ ప‌డిపోవ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close