ఈ ఉగాది అయినా మనస్సాక్షిని అమ్ముకుంటున్న మీడియాలో మార్పు తెస్తుందా?

తెలుగు నేలపై అవినీతి, ఆశ్రిత పక్షపాతం, కులమత దరిద్రాలు పోవాలన్నా, నీతి, నిజాయితీతో కష్టపడేవాడికి సంతోషం మిగలాలన్నా, అవినీతి, అక్రమ మార్గాలలో నడిచే వాళ్ళందరూ కూడా బయట తిరగడానికి సిగ్గుపడాలన్నా……ఇంకా ఎన్నో ఎన్నో మంచి విషయాలకు తెలుగు నాట చోటు ఉండాలంటే మాత్రం తెలుగు మీడియాకు పట్టిన దరిద్రాలు వదిలిపోవాలి. తెలుగు సమాజంలో చెడు నాలుగు పాదాలపై దర్జాగా నడుస్తోందంటే దానికి ప్రధాన కారణం మీడియాకు పట్టిన దరిద్రమే. అన్‌బయాస్డ్‌గా ఉండడాన్ని మన మీడియా ఎప్పుడో మర్చిపోయింది. ఇప్పుడున్న కొన్ని ప్రధాన మీడియా సంస్థల యజమానులంత క్రిమినల్స్‌ని మనం ఎక్కడా చూడం. పొద్దున్నలేస్తే నీతులు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎంతగొప్పవాళ్ళు అన్న విషయం గురించి వాళ్ళే డప్పేసుకుంటూ ఉంటారు. కానీ జర్నలిస్ట్‌లుగా కాదు కదా….నిజాయితీగా ఆలోచించే మనుషులుగా కూడా వాళ్ళు ఎప్పుడో చనిపోయారు. మనస్సాక్షిని పాతాళంలో పాతేశారు.

జగన్‌కి బెయిల్‌ని రద్దు చేయాలన్న పిటిషన్‌ని సిబిఐ కోర్టు స్వీకరించింది. ఆ విషయాన్ని కొన్ని భజన మీడియా సంస్థలన్నీ కూడా సూపర్బ్‌గా కవర్ చేశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఆ సమాచారం చేరాలని తపనపడ్డాయి. జగన్ అవినీతిపరుడు, త్వరలో జైలుకు వెళ్ళే అవకాశం ఉంది అని అందరినీ నమ్మించాలని చూశారు. కొంచెం ఘాటు ఎక్కువైనా కూడా ఈ సమాచారాన్ని ప్రజలకు అందించాలనుకోవడంలో అస్సలు తప్పులేదు. ఒక మీడియా సంస్థ మాత్రం ఈ సమాచారాన్ని ప్రజలకు తెలియకుండా చేయడం కోసం తాపత్రయపడింది. ఈ విషయంలో మాత్రం కచ్చితంగా ఆ మీడియాది వందశాతం తప్పు.

ఇక జగన్ కేసుకు కేవలం కొన్ని రోజుల క్రితమే చంద్రబాబునాయుడి ఓటుకు నోటు కేసును సుప్రీం కోర్ట్ స్వీకరించింది. జగన్ కేసులకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలందరికీ చేరవేయాలని తాపత్రయపడ్డ మీడియా మొత్తం కూడా చంద్రబాబు కేసుల గురించి ప్రజలకు తెలియకుండా చేయడం కోసం ప్రయత్నించింది. ఎంత తక్కువ చేసి చూపించాలో అంతా చేశారు. ఆ మీడియా సంస్థల యాజమాన్యాలకు మనస్సాక్షి అంటూ ఉందా? డబ్బులే కావాలనుకుంటే వేరే వ్యాపారాలు చేసుకోవచ్చుగా. కోట్లాది మంది ప్రజలకు అబద్ధాలు చెప్పడం ఎంత పెద్ద క్రైమ్ అవుతుంది. కోట్లాది మంది ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడానికి మనస్సాక్షి ఎలా ఒప్పుకుంటోంది? ప్రజలకు మీడియాపైన ఉన్న నమ్మకాన్ని ఫణంగా పెట్టి డబ్బు కోసం కక్కుర్తి పడతారా? జర్నలిస్టులా? కాదా? అన్నది తర్వాత….అసలు మనుషులేనా? ఇక ఇదే మీడియా జనాలు ఓటర్లకు చెప్పే నీతులు కూడా పరమ విచిత్రంగా ఉంటాయి. ఓట్లు చీలిపోకుండా ఉండాలి అనే నెపంతో తాము అమ్ముడుపోయిన నాయకుడికి ఓటర్ల ఓట్లన్నీ పడేలాగా నానా రకాల అబద్ధాలు, అసత్యాలు చెప్తూ ఉంటారు. ఓటర్లను బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు. ఓట్లు చీలితే నష్టం ఏంటి? గెలిచే అభ్యర్థికో…లేకపోతే బలమున్న అభ్యర్థికే ఓట్లు వేయాలా? నూటికి తొంభైశాతం మంది అభ్యర్థులు ఆర్థిక బలం, అంగబలం ఉన్నవాళ్ళే ఉంటున్నారు. అన్నిపార్టీలు కూడా క్రిమినల్స్‌కే సీట్లిస్తున్నాయి. అలాంటి నేపథ్యంలో ఒక మంచివాడు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నప్పుడు …ఆ అభ్యర్థికి పది ఓట్లు వస్తే మాత్రం నష్టం ఏంటి? అలాంటి అభ్యర్థులకు పడే ఓట్ల శాతం పెరిగే కొద్దీ ఇంకా ఇంకా చాలా మంది మంచి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారు. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పదుల సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు ఉండేవారు. ఇప్పుడు ఒక్కరికి కూడా అవకాశం లేకుండా చేసింది మన దరిద్రపు మీడియా. పార్టీలకు అమ్ముడుపోయిన ఈ మీడియా ముసుగువేసుకున్న అక్రమ వ్యాపారస్తులే రాజకీయాల్లో మంచివాళ్ళకు స్థానం లేకుండా చేస్తున్నారు.

ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నీ కూడా అవినీతి, అక్రమాలలో పీకల్లోతులో కూరుకుపోయినవే. అందులో మళ్ళీ ఎక్కువ-తక్కువ తేడాల్లేవ్. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం జేసీ దివాకర్‌రెడ్డి ఎంత పెద్ద క్రిమినల్ అన్న విషయాన్ని ప్రపంచానికి చెప్పింది చంద్రబాబే. మరి అదే చంద్రబాబు జేసీని తన పార్టీలో ఎలా చేర్చుకున్నాడు? పదవులు ఎలా కట్టబెట్టాడు? అమ్ముడుపోయిన మీడియాకు ఇలాంటి నిజాలు కనిపించవు. గ్రామ సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకూ కూడా అందరూ తమను కొనుక్కున్న పార్టీకి చెందిన వాళ్ళే ఉండాలని తాపత్రయపడుతుంది మీడియా. అందుకే అన్ని విలువలూ వదిలేసి శారీరకంగా, మానసికంగా కూడా పూర్తిగా బానిసలు అయిపోతున్నారు. కూడు, గూడు లేనివాళ్ళకు కూడా కాస్తయినా ఆత్మాభిమానం ఉంటుందేమో కానీ ఈ మీడియా వ్యభిచారులకు మాత్రం అస్సలు ఉండదు. ఆ స్థాయి బానిసత్వం వీరిది. బస్సు ప్రమాదాలు, స్త్రీలపై అత్యాచారాలు, అవినీతి వ్యవహారాలు, హత్యలు, దోపిడీలు….ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న ఇలాంటి అన్ని క్రైమ్స్ విషయంలోనూ తమను కొన్న క్రిమినల్స్‌కే కాపు కాయడానికి బానిస మీడియా మానసికంగా సిద్ధపడిపోయింది.

ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా మన దరిద్రపు మీడియా మారాలని కోరుకుందాం. తప్పు చేసినవాడిని సమర్థించేలా కాదు….తప్పు చేసినవాడు సిగ్గుపడేలా వార్తలు ఉండాలని కోరుకుందాం. ఫలానా వాడు మాత్రమే రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడు, అభివృద్ధిలోకి తీసుకెళ్తాడు లాంటి బానిసత్వ ఆలోనలను జనాలపైన రుద్దకూడదని కోరుకుందాం. చంద్రబాబు, జగన్, పవన్…ఇంకా ఎవరెవరో….ఓ పదిమంది లేకపోయినంత మాత్రాన రాష్ట్ర ప్రజల జీవితాలు ఏమీ కావు. వీళ్ళు ఉండి ఉద్ధరిస్తున్నది కూడా ఏమీ లేదు. అలా ఉద్ధరించి ఉంటే పదేళ్ళ కాలంలో ప్రజల జీవితాలను పూర్తిగా మార్చవచ్చు. ఆ స్థాయి వనరులు మన సొంతం. మంచి నాయకులు, ప్రజా సేవ చేయాలనుకుంటున్న వాళ్ళూ రాష్ట్రంలో చాలా మందే ఉన్నారు. ప్రధాన పార్టీలన్నీ అవినీతిమయమైపోయిన నేపథ్యంలో….ఆ పార్టీలలో చేరలేక, ఆ పార్టీలలో ఇమడలేక ఇండిపెండెంట్లుగా పోటీచేయాలనే ఆలోచనలో ఉంటారు వాళ్ళు. కానీ ఆ రెండు పార్టీలలో ఏదో ఒక గెలిచే పార్టీకి ఓటేయండి అని చెప్పి అమ్ముడుపోయిన మీడియా మనల్ని బానిసలుగా చేస్తోంది. మంచి వాడికి ఓటేద్దాం. పార్టీ బలం, అంగ బలం, అర్థ బలం లేకపోతేనేమి…మంచి వాడు, ప్రజా సేవ విషయంలో చిత్తశుద్ధి ఉన్నవాడు అయితే గెలిచినా, ఓడినా మనకు అండగా నిలబడతాడు. అలాంటి మంచి వాళ్ళకు పడే ఓట్ల శాతం పెరుగుతూ ఉంటే….ఇంకా చాలా చాలా మంది మంచి నాయకులు, సమర్థులు రాజకీయాల్లోకి వస్తారు. అలాంటి పరిస్థితే వస్తే ఇప్పుడున్న అవినీతి నాయకుల్లో కూడా భయం పుడుతుంది. అవినీతి నాయకులను సమర్థించే మీడియాను బహిష్కరించడం ప్రారంభిస్తే జర్నలిజాన్ని వ్యభిచారంగా మారుస్తున్న ఆయా మీడియా సంస్థలకు బుధ్ది వస్తుంది. ప్రజల కోసం పనిచేసే నాయకులు, జర్నలిస్ట్స్‌కి ప్రోత్సాహం అందిస్తే చాలు……ప్రజల ధన, మాన, ప్రాణాలకు పూర్తి రక్షణ ఉన్న……. సమాజ వ్యతిరేక శక్తులకు సామాన్యులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేని సమాజంవైపుగా మొదటి అడుగు అయితే కచ్చితంగా పడుతుంది. అలాంటి ఓ మంచి ప్రయత్నానికి ఈ ఉగాది ఆది కావాలని కోరుకుందాం. మనస్సాక్షిని నమ్ముకుందాం….మంచిని అనుసరిద్దాం….చుట్టూ ఉన్న పదిమందికీ మనమే ప్రేరణ అవుదాం…..మన కుటుంబంతో పాటు మన సమాజం కోసం కూడా సమయాన్ని కేటాయిద్దాం….చెడును దూరం పెడుతూ….మంచిని ప్రోత్సహిద్దాం. మన జీవితాల్లో ఆనందాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close