హార్దిక్ పటేల్ వక్ర మార్గంలో పయనిస్తున్నాడా?

యువత తమ మేధోశక్తిని సరయిన మార్గంలో వినియోగిస్తే ఒక సత్యం నాదెళ్ళ, ఒక ఇంద్రా నూయీ, సుందర్ పిచ్చాయ్, పద్మశ్రీ వారియర్ అవుతారు. అదే వినాశకర పనులకు వినియోగిస్తే ఒక యాకుబ్ మీమన్, ఒక ఉస్మాన్ ఖాన్, ఒక ఇంద్రాణీ ముఖర్జీ అవుతారు. మనుషులు తమ తెలివితేటలను, నాయకత్వ లక్షణాలను సద్వినియోగం చేసుకొంటే దాని వలన వారు, వారి చుట్టూ ఉండే సమాజం కూడా ఎంతో లబ్ది పొందుతుంది. అదే వక్ర మార్గం పడితే వారు, వారి వలన సమాజం కూడా భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది.

ఇదే విషయం పలుమార్లు రుజువయింది. పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోరుతూ గుజరాత్ లో ఉద్యమిస్తున్న హార్దిక్ పటేల్ ఇదే విషయం మరోమారు నిరూపిస్తున్నాడు. తమకు రిజర్వేషన్లు కేటాయించాలని కోరుతూ హార్దిక్ పటేల్ మొదలు పెట్టిన ఉద్యమానికి రాష్ట్రంలో 9మంది సామాన్య పౌరులు బలయిపోయారు. రెండు మూడు రోజుల వ్యవధిలో గుజరాత్ లో కోట్లాది రూపాయల విలువ గల ఆస్తులు బూడిద పాలయ్యాయి. తను మొదలు పెట్టిన ఈ విద్వంసకర ఉద్యమం వలన రాష్ట్రానికి, దేశానికి తీరని నష్టం జరుగుతోందని తెలిసి ఉన్నప్పటికీ హార్దిక్ పటేల్ తన తెలివితేటలను, నాయకత్వలక్షణాలతో తమ ఉద్యమాన్ని కొత్త పద్దతులలో ముందుకు నడిపిస్తూ మరింత ఉదృతం చేస్తున్నాడు.

సమాజంలో కులవివక్ష కారణంగా అణచివేతకు గురవుతున్నవారు, ఆర్ధికంగా వెనుకబడిన వారికి సమానావకాశాలు కల్పించేందుకే మన దేశంలో దశాబ్దాలుగా రిజర్వేషన్ల విధానం అమలుచేయబడుతోంది. దేశంలో, ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రంలో మిగిలిన సామాజిక వర్గాలతో పోలిస్తే పటేల్ సామాజిక వర్గ పరిస్థితి చాలా మెరుగ్గానే ఉంది. కానీ తమకూ రిజర్వేషన్లు కావాలని పోరాడుతున్న హార్దిక్ పటేల్ పటేల్ కులస్తులు అందరూ బ్యాంకుల్లో దాచుకొన్న డబ్బులను వెనక్కి తీసుకొని ప్రభుత్వానికి ఆర్ధిక సహాయ నిరాకరణ చేయాలని పిలుపునిచ్చారు. ఒక అనధికార అంచానా ప్రకారం పటేల్ సామాజిక వర్గానికి వివిధ బ్యాంక్ లలో సుమారు 70 లక్షల ఖాతాలున్నాయి. అందులో సుమారు రూ.350 కోట్లు వరకు నిలువ ఉండి ఉండవచ్చని తెలుస్తోంది. కానీ పటేల్ కులస్తులలో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. కనుక అంతకంటే పదిరెట్లు డబ్బు బ్యాంకులలో నిలువ ఉండి ఉండవచ్చును. ఆ డబ్బు అంతా ఒక్కసారే వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తే బ్యాంకులు చాలా ఇబ్బందుల్లో పడతాయి.

తనని తాను సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంత గొప్పవాడిగా భావిస్తూ సర్దార్ పటేల్ అని సగర్వంగా చెప్పుకొంటున్న హార్దిక్ పటేల్, ఆ మహనీయుడి దేశభక్తిని, సేవా నిరతిని మాత్రం అవగాహన చేసుకోలేకపోయాడు. తన తెలివితేటలతో తన స్వంత రాష్ట్రమయిన గుజరాత్ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన విన్నూత్నంగా ఉద్యమం నడుపుతున్న తీరుని అందరూ హర్షించవచ్చు. కానీ ఆయన ఎంచుకొన్న మార్గం చాలా వినాశకరం. దాని వలన పటేల్ సామాజిక వర్గం కూడా తీవ్రంగా నష్టపోవచ్చును. పటేల్ కులస్తులు బ్యాంకుల్లో దాచుకొన్న డబ్బుని వెనక్కి తీసుకొని ఆర్ధిక సహాయ నిరాకరణ చేయమని పిలుపునీయడం ద్వారా పటేల్ ఆర్ధికంగా చాలా బలంగా ఉన్నారని హార్ధిక్ పటేల్ స్వయంగా దృవీకరించినట్లయింది. పటేల్ సామాజిక వర్గం ఒక రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థని శాసించగలదని తెలియజేస్తున్నప్పుడు మరి వారికి రిజర్వేషన్లు కావాలని హార్దిక్ పటేల్ ఎందుకు పోరాడుతున్నట్లు? అంటే అతనికి వేరే ఇతర ఉద్దేశ్యాలు ఉండి ఉండవచ్చును లేదా అతని వెనుక ఎవరో ఉండి ఇందుకు ప్రోత్సహిస్తున్నట్లు అనుమానించవలసి వస్తోంది.

పటేల్ కులస్తులు అందరూ ఆర్ధికంగా ఉన్నవారయ్యి ఉండకపోవచ్చును. కానీ వారిలో చాలా మందికి జీవితంలో ఉన్నత స్థితికి చేరాలనే తపన, అందుకోసం తీవ్రంగా శ్రమించే గుణం, తెలివి తేటలు ఉన్నాయి. దేశంలో కోట్లాది మంది భారతీయులు, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, రైతులు, నేతన్నలు కనీసం ఒక్క పూట తినేందుకు తిండి కూడా దొరక్క అష్టకష్టాలు పడుతున్నారు. వారితో పోలిస్తే పటేల్ సామాజిక వర్గం చాలా బలంగానే ఉన్నట్లు స్పష్టం అవుతోంది. అటువంటప్పుడు తమకూ రిజర్వేషన్లు కావాలని ఉద్యమించడం, అందుకోసం రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడం, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థని దెబ్బ తీయలనుకోవడం అన్ని వినాశకర ఆలోచనలేనని చెప్పక తప్పదు.

హార్దిక్ పటేల్ మొదలుపెట్టిన ఈ ఉద్యమాన్ని చూసి దేశంలో మిగిలిన రాష్ట్రాలలో కూడా ఇటువంటి ఉద్యమాలు మొదలవుతున్నాయి. రాజకీయంగా ఎదగాలనుకొనే వారు ఇటువంటి ఉద్యమాలు చేయడం మన దేశంలో సర్వసాధారణమయిన విషయమే. కానీ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ వారసుడినని సగర్వంగా చెప్పుకొనే హార్దిక్ పటేల్ వంటి యువకుడు కూడా అదే మార్గాన్ని ఎంచుకోవడం చాలా శోచనీయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close