వీడని అదితి మిస్టరీ: రు.కోటి దాటిపోయిన సెర్చ్ఆపరేషన్ వ్యయం

హైదరాబాద్: విశాఖపట్నంలో ఆరురోజులక్రితం తప్పిపోయిన ఆరేళ్ళ బాలిక అదితి వ్యవహారం ఇంకా మిస్టరీగానే ఉంది. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. గాలింపు దళాలు మురుగుకాల్వలలో ఆపేసి పూర్తిగా సముద్రంపైనే దృష్టిపెట్టాయి. డ్రైనేజిలో ఇప్పటికి దాదాపు 20సార్లు గాలించి ఉండటంతో పాప డ్రైనేజిలో లేదనే నిర్ధారణకొచ్చారు. మరోవైపు నిన్న విప్‌ల సదస్సుకు హాజరవటానికి విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అదితి తండ్రి శ్రీనివాసరావును కలిసిన సందర్భంగా అధికారులను పిలిచి సముద్రతీరంలో 100 కిలోమీటర్లవరకు గాలించాలని ఆదేశించారు. తమ పాపను వెదికేందుకు అధికార యంత్రాంగం శక్తిమేరకు యత్నిస్తోందని, అయినా ఆచూకీ దొరకకపోవటం తమ దురదృష్టమని శ్రీనివాసరావు వాపోయారు. నిజంగానే జీవీఎమ్‌సీ ఈ వ్యవహారంలో అద్భుతంగా కష్టపడిందని అందరూ అంటున్నారు. పాప పడిపోయినరోజు వెంటనే స్పందించటంలో అలసత్వం ప్రదర్శించినట్లు విమర్శలు వ్యక్తమయినా, తర్వాతమాత్రం బాగా కష్టపడినట్లు ప్రశంసలు అందుకుంటోంది. ఒక పెద్ద నాయకుడో, ప్రజా ప్రతినిధో కనిపించకుండాపోతే వెతికిన స్థాయిలో అదితికోసం వెతుకుతున్నారన్నదిమాత్రం ఎవరూ కాదనలేరు. సెర్చ్ ఆపరేషన్ వ్యయం ఇప్పటికే కోటి రూపాయలు దాటిపోయిందని అంటున్నారు.

ఇక అదితికోసం సోషల్ మీడియాలోకూడా అన్వేషణ ప్రారంభమయింది. అదితి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే తెలియజేసేందుకువీలుగా finding aditi పేరుతో ఆమె బాబాయి ఫేస్‌బుక్‌లో ఒక ఖాతా తెరిచారు. మరోవైపు కిడ్నాప్ కోణంలోకూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ గురుమూర్తిపై నిఘా వేసి ఉంచారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close