కొరటాలపై కన్నేసిన అఖిల్..!

అఖిల్ సినిమా రిలీజ్ అవ్వక ముందే తన రెండో సినిమా ప్రయత్నాలు ముమ్మరం చేశాడు అక్కినేని అఖిల్. ప్రస్తుతం వినాయక్ దర్శకత్వంలో ఈ నెల 21న రిలీజ్ అవ్వబోతున్న అఖిల్ సినిమా గురించి అన్ని కార్యక్రమాలను పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నారు అఖిల్ దర్శక నిర్మాతలు. అయితే అఖిల్ సినిమా ఎలాగూ హిట్ అనే ధీమాగానే ఉన్నారు అక్కినేని ఫ్యాన్స్. మొదటి సినిమా కంప్లీట్ అయ్యింది కాబట్టి అఖిల్ ఇప్పుడు తన రెండవ సినిమా గురించి వేట మొదలెట్టాడు.

శ్రీమంతుడు సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రైటర్ కమ్ డైరక్టర్ కొరటాల శివతో అఖిల్ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడనే వార్తలు ఫిల్మ్ నగర్లో చెక్కర్లు కొడుతున్నాయి. మొదటి సినిమా కమర్షియల్ అంశాలతో వస్తుంటే రెండవ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడట అఖిల్. అంతేకాదు కథ గురించి నాగార్జున, అఖిల్ కొరటాల శివను పిలిపించి మాట్లాడారట.

అఫిషియల్ గా ఎనౌస్న్ మెంట్ మాత్రం అఖిల్ సినిమా రిలీజ్ తర్వాత వచ్చే ఛాన్స్ ఉంది. అసలైతే కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని హడావిడి చేస్తుంటే సడెన్గా అఖిల్ తో శివ సినిమా అని చెప్పడంతో కాస్త షాకింగ్ గా ఉంది.. మొదటి సినిమా ఎలాగూ కమర్షియల్ గా కొడుతున్నాడు కాబట్టి. రెండవ సినిమా మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రావలనుకుంటున్నాడు ఈ అక్కినేని కుర్ర హీరో.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫోటోలు – టీడీపీ మేనిఫెస్టోలో వైసీపీకి కనిపిస్తున్న లోపాలు !

వైసీపీ మేనిఫెస్టోపై ప్రజల్లో జరుగుతున్న చర్చ జీరో. ఆ పార్టీ నేతలు కూడా మాట్లాడుకోవడం లేదు. కానీ టీడీపీ మేనిపెస్టోపై టీడీపీ నేతలు ప్రత్యేకమైన ప్రణాళికలతో ప్రచార కార్యక్రమం పెట్టుకున్నారు. అదే...

టార్గెట్ పవన్ కళ్యాణ్ …పొన్నూరులో వైసీపీ అభ్యర్థి దౌర్జన్యం

ఏపీలో టీడీపీ సారధ్యంలోని కూటమిదే అధికారమని సర్వేలన్నీ స్పష్టం చేస్తుండటంతో వైసీపీ నేతల్లో ఫ్రస్టేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబును అడ్డుకుంటే అది వైసీపీకి డ్యామేజ్ చేస్తుందని భావించి పవన్ ను వరుసగా టార్గెట్...

బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ … లక్ష్యం అదే..!?

బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ కూడా వెళ్తున్నట్లు కనిపిస్తోంది.గతంలో ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇచ్చినట్టుగానే ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే చేస్తుండటంతో ఆ పార్టీపై పెదవి విరుపులు మొదలయ్యాయి. ...

మోదీ రోడ్ షోలతో కూటమికి మరింత ఊపు !

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయడానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రానున్నారు. ఆయన టూర్ షెడ్యూల్‌ కూడా ఖరారైంది. చిలకలూరిపేటలో ఉమ్మడి ప్రచార సభ నిర్వహించిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close