రివ్యూ : సదా సీదా రొటీన్ కథతో ‘చుట్టాలబ్బాయి’

తొలి చిత్రం ప్రేమ కావాలి, మలి చిత్రం లవ్లీ తరవాత సరైన సక్సెస్ లేక తడబడుతున్నయంగ్ హీరో ‘ఆది’ ఈ సారి ఫ్యామిలీ కదాంశంతో చేసిన సినిమానే ఈ ‘చుట్టాలబ్బాయి’. ‘పూలరంగడు, భాయ్’ చిత్రాల దర్శకుడు వీరభద్రం చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘నమితా ప్రమోద్’ హీరోయిన్ గా నటించగా ఆది తండ్రి ‘ సాయి కుమార్’ ఓ ప్రధాన పాత్రలో నటించాడు. ఆది ఇప్పటివరకు చేసిన చిత్రాలలో హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మించిన నిర్మాతలు వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్ళూరి, ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో తెలుసుకుందాం….

కథ :

ఓ బ్యాంకులో రికవరీ ఏజెంట్ గా బాబ్జీ (ఆది) పని చేస్తుంటాడు. హైదరాబాద్ సిటీకి చెందిన పోలీస్ ఆఫీసర్ (అభిమన్యు సింగ్) అతని చెల్లెలు కావ్య (నమితా ప్రమోద్)ను ఒకానొక సందర్భం లో అనుకోకుండా వాళ్ళను కలుస్తాడు బాబ్జీ. వీరిద్దరి పరిచయాన్ని గమనించిన పోలీస్ ఆఫీసర్ వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారని పొరపాటు పడతాడు. బాబ్జీ తమది ప్రేమ కాదని పోలీస్ ఆఫీసర్ కి వివరణ ఇవ్వాలనుకునేలోపు కావ్య కు పోలీస్ ఆఫీసర్ ఓ సంబంధం ఫిక్స్ చేస్తాడు. ఆ పెళ్లి సంబంధం ఇష్టం లేక కావ్య ఇంట్లో నుంచి పారిపోతుంటుంది. ఇంట్లోంచి పారిపోయిన కావ్యతో బాబ్జీ ఓ పల్లె టూరు కి చేరుకుంటాడు. అలా పారిపోయే వాళ్ళను ఒక గ్యాంగ్ ఫాలో చేస్తుంటుంది. ఆ గ్యాంగ్ ఎవరు ? వాళ్ళు బాబ్జీ, కావ్యాలను ఎందుకు ఫాలో చేస్తారు ? సొంత వూరికి చేరిన తరువాత బాబ్జీ ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు ? వాటి నుండి ఎలా తప్పించుకున్నాడు ? అసలు తమ మధ్య ప్రేమే లేదనుకున్న బాబ్జీ, కావ్యలు ఒక్కటయ్యారా ? అన్నదే మిగతా కథ.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ :

హీరో ఆది తనలో ఉన్న కామెడీ టైమింగ్ ను కూడా ఆది బాగా ఉపయోగించుకుని కాస్త ఎంటర్టైన్ చేసాడు. తన గత సినిమాల కంటే ఈ చిత్రం లో నటన పరంగా మంచి హావభావాలను పలికించాడు. మొదటి పాటలో అతను చేసిన డ్యాన్స్ బాగుంది. సాయి కుమార్ పాత్ర పెద రాయుడు చిత్రం లో రజని కాంత్ పాత్రలాగా అదిరిపోతుందని, స్పెషల్ గా ఉంటుందని చిత్రం యూనిట్ చెప్పుకొచ్చారు. కానీ, సినిమాలో ఆ పాత్ర చాలా లైట్ గా, రొటీన్ గా ఉండి చాలా నిరుత్సాహం పరిచింది. హీరోయిన్ నమితా ప్రమోద్. సినిమాలో చాలా చోట్ల రొమాంటిక్ సన్నివేశాల్లో మాత్రమే బాగుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా పూర్ గా వుంది. ఇక హీరో ఫ్రెండ్స్ గా షకలక శంకర్ కామెడీ పంచ్ లు అక్కడక్కడా పేలాయి. పోసాని కామెడీ ట్రాక్ సినిమాకు కొంత వరకూ ఊరట నిచ్చింది. ఆత్మభిమానం గల రౌడీ పాత్రలో పృథ్వి రాజ్ చేసిన కామెడీ నవ్విస్తుంది. ఫస్ట్ హాఫ్ నుండి ఇంటర్వెల్ వరకు పృథ్వి రాజ్ కామెడీ పంచ్ లతో కథ తో పాటే సాగుతూ హష్యాన్ని పండించాడు. సెకండ్ హాఫ్ లో అలీ పై నడిచే కొన్ని రొటీన్ కామెడీ సన్నివేశాలు బోర్ కొట్టాయి. రఘుబాబు, క ష్ణభగవాన్‌,చమ్మక్‌ చంద్ర, రచ్చ రవిలు తమ పాత్రల మేరకు నటించారు.

సాంకేతిక వర్గం :

దర్శకుడి ‘భాయ్’ చిత్రం లాగే చుట్టాల’బ్బాయ్’ కూడా నిరాశ పరిచిందని చెప్పొచ్చు. సరైన కథ ను సెలెక్ట్ చేసుకోకపోవడమే వీర భద్రం చౌదరి చేసిన పొరపాటు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఈ సినిమా కథ చాలా సినిమాల్లాగే రొటీన్ గా సాగుతుంది. కథలో ఎక్కడా కొత్తదనం కానీ, కథనంలో వేగం కానీ కనిపించవు. అరుణ్‌కుమార్‌ కెమెరా పనితనం బాగుంది. సెకండ్ హాఫ్ లోని పల్లెటూరి నైపథ్యంలో సాగే సన్నివేశాలను చాలా అందంగా తీర్చి దిద్దాడు. థమన్ అందించిన సంగీతం మొదటి పాటలో బాగుండి మిగతా అంతా పరవాలేదనిపించింది. ఎడిటింగ్ ఓ కె. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమా చూస్తున్నంత సేపు నిర్మాతలు కాంప్రమైస్ కాకుండా పెట్టిన ఖర్చు స్పష్టంగా కనిపిస్తుంది.

విశ్లేషణ :

ఈ చిత్రానికి మెయిన్ డ్రా బ్యాక్ కథ మరీ సదా సీదా రొటీన్ కథ, ఇలాంటి పాత కథ కు ఇంత బడ్జెట్ పెట్టడం అవసరమా అనిపిస్తుంది. కథలో ఎక్కడా కొత్తదనం కానీ, కథనంలో వేగం కానీ కనిపించవు. ప్రతి చోటా తరువాత ఏం జరుగుతుంది అనేది ముందుగానే ఊహించెయ్యవచ్చు. ఫస్ట్ హాఫ్ లో గాని,సెకండ్ హాఫ్ లో గాని కథలో, కథనంలో ఎక్కడా ఆసక్తికరమైన మలుపులు, ట్విస్ట్ లు లేకుండా సినిమా సాదాసీదాగా వుంది ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. అటు కామెడీ సినిమా కాకుండా, ఇటు ఫామిలీ మూవీ కాకుండా అంతా అయోమయంగా ఉంటుంది. మొదటి నుండి సినిమాలో ‘సాయి కుమార్’ పాత్ర అదిరిపోతుందని, స్పెషల్ గా ఉంటుందని ఊదర కొట్టారు. కానీ సినిమాలో ఆ పాత్ర చాలా ఆర్డినరీ పాత్ర. ఏ విధం గాను ఎలాంటి ఆకర్షణలు లేని ఆర్డినరీ మూవీ. చివరాఖరికి చెప్పేదేటంటే ఇది ఏ వర్గానికి నచ్చని సినిమా.

తెలుగు360.కామ్ రేటింగ్ 1.5/5
బ్యానర్స్ : శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్‌, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా….
నటీనటులు : లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది, నమిత ప్రమోద్‌, డైలాగ్‌కింగ్‌ సాయికుమార్‌, బ్రహ్మానందం, పోసాని క ష్ణమురళి, ప థ్వి, రఘుబాబు, క ష్ణభగవాన్‌, అభిమన్యు సింగ్‌, జీవా, సురేఖావాణి, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, రచ్చ రవి, గిరిధర్‌, అనితనాథ్‌ తదితరులు…
సంగీతం: ఎస్‌.ఎస్‌. థమన్‌,
సినిమాటోగ్రఫీ: ఎస్‌.అరుణ్‌కుమార్‌,
ఆర్ట్‌: నాగేంద్ర,
ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌,
మాటలు: భవాని ప్రసాద్‌,
నిర్మాతలు: వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్ళూరి,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరభద్రమ్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close