చూడూ…నేను చూపించినవైపే చూడుః ఇదే ఆర్కె ఫిలాసఫీ

ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు విచక్షణ, వివేచనలాంటివి ఏ మేరకు ఉన్నాయో తెలియదు కానీ రాజకీయాల గురించి కాస్త అవగాహన ఉండి…ఆలోచనాపరులు అయిన వాళ్ళకు మాత్రం రాధాకృష్ణరాతలతో పిచ్చెక్కిపోవడం ఖాయం. అది కూడా గత కొన్నేళ్ళ నుంచీ ఆయన చేస్తున్న వీకెండ్ కామెంట్ వంటకాన్ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్ళకు మాత్రం మెంటలెక్కడం ఖాయం. అలా కాకుండా గుడ్డిగా ఆయనని ఫాలో అయితే మాత్రం మూర్ఖపు వాదనలతో కాలక్షేపం చేయడం ఎలా అని విద్య తెలిసిపోతుంది. రాధాకృష్ణ సిద్ధాంతం కూడా అదే. సింహా సినిమాలో ‘ఒకవైపే చూడు’ అని నందమూరి బాలకృష్ణ చెప్తాడు. కానీ రాధాకృష్ణ మాత్రం నేను చూపించిన వైపే చూడు అని చెప్తాడు. నేను చెప్పిందే నమ్మమంటాడు. ఈ వారం వీకెండ్ కామెంట్‌లో కూడా అదే చేశాడు.

మోడీ అవినీతి రాజకీయాలను ప్రోత్సహిస్తాడు, విభజన రాజకీయాలను పాటిస్తాడు, రాజనీతిజ్ఙడు కాదు…ఫక్తు రాజకీయ నాయకుడు, మైనారిటీ వ్యతిరేకి, పదవుల కోసం ఏమైనా చేస్తాడు, వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తున్నాడు. మోడీ కంటే కాంగ్రెస్ పాలనే బెటర్…..ఇలా బోలెడన్ని విషయాలు చెప్పుకుంటూ వెళ్ళాడు రాధాకృష్ణ. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నాటి ఉదాహరణలను కూడా ప్రస్తావించాడు. ఆ రాతలన్నింటికీ కారణం ఒక్కటే. జగన్ పైన ద్వేషం. మోడీ ఎక్కడ చంద్రబాబుకు హ్యాండ్ ఇస్తాడో? జగన్‌ని లిఫ్ట్ చేస్తాడో అన్న భయం. ఆ భయం మాత్రం రాధాకృష్ణ ప్రతి అక్షరంలోనూ కనిపించింది. చాలా జాగ్రత్తగా…చదివేవాళ్ళకు పూర్తి నమ్మకం కలిగేలా వీకెండ్ కామెంట్ రాసుకొచ్చాడు రాధాకృష్ణ. రాజకీయాల పైన, రాధాకృష్ణ రాతలపైన అవగాహన లేకపోతే ఆర్కె కామెంట్‌ని నమ్మడం కూడా ఖాయం. కానీ రాధాకృష్ణ రాతలు, చంద్రబాబు రాజకీయాల పైన అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం నమ్మే అవకాశం అస్సలు లేదు. అలాగే రాధాకృష్ణ జర్నలిజం స్థాయి ఏంటి అని కూడా బోలెడన్ని కామెంట్స్ చేయడం ఖాయం.

ఈ రోజు వీకెండ్ కామెంట్‌లో మోడీ గురించి రాధాకృష్ణ చెప్పినవన్నీ నిజాలే అనుకుందాం. మరి 2014లో రాధాకృష్ణకు ఈ నిజాలు ఎందుకు కనిపించలేదు? సోనియాగాంధీతో సహా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఎంతటి రాక్షసులో…మోడీ ఎంత గొప్ప దేవుడో అన్న విషయాన్ని రకరకాలుగా వర్ణిస్తూ ఆంధ్రజ్యోతి మీడియాలో యాభై శాతం వార్తలను కవర్ చేసినప్పుడు మోడీ అవినీతి రాజకీయాలు చేస్తాడు అన్న విషయం రాధాకృస్ణకు తెలియదా? మోడీ మైనారిటీ వ్యతిరేకి అన్న విషయం 2014 ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఎందుకు చెప్పలేదు? మోడీ ప్రధాని అయితే అవినీతి అంతమైపోతుంది, దేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది అని ప్రజలను ఎందుకు నమ్మించాడు? అవినీతిపరుడు, విభజన రాజకీయాలు చేసేవాడు, నియంత, మైనారిటీ వ్యతిరేకి అయిన మోడీని అనునిత్యం పొగుడుతున్న చంద్రబాబు, అలాంటి మోడీతో పొత్తు పెట్టకున్న చంద్రబాబు ఏమవుతాడు? శశికల అవినీతి పరురాలు, జగన్ అవినీతి పరుడు అని రాధాకృస్ణ చెప్పిన మాట కూడా నిజం. మరి చంద్రబాబునాయుడు ఏంటి? చంద్రబాబు అవినీతిపరుడు కాదు అని రాధాకృష్ణ చెప్పగలడా? ఇక ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిజిపి ఎన్ని కోట్ల రూపాయలతో ఓట్లను కొనుగోలు చేసిందో వివరించాడు రాధాకృష్ణ. మరి తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి వాళ్ళు ఓటుకు ఐదు వేల నుంచి పదివేలు…అది కూడా చెక్కుల రూపంలో ఓటర్లకు పంచిన విషయం ఈ పత్రికాధిపతికి తెలియదా? ఇక గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉన్నప్పటికీ ప్రజాభిప్రాయాన్ని కాలరాసి బిజెపి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారని కూడా వాపోయాడు ఆర్కే. మరి మెజార్టీ లేకపోయినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి…ఓటుకు ఐదు కోట్లకు బేరం పెట్టి వీడియా సాక్ష్యంతో సహా దొరికిపోవడం, ఆ విధంగా చేసుకుపొమ్మని అధినేత బ్రీఫింగ్ ఇవ్వడాన్ని ఏమనాలో ఆర్కెనే చెప్పాలి.

2019లో బిజెపివాళ్ళు చంద్రబాబుకు హ్యాండ్ ఇస్తున్నారు అన్న విషయంలో మాత్రం టిడిపికి పూర్తి స్పష్టత వచ్చేసినట్టుగానే ఉంది. ఇక జగన్‌తో పొత్తు పెట్టకోకుండా చేయడమే టార్గెట్. అందుకే 2019 ఎన్నికలు అయిపోగానే బిజెపిలో వైసిపిని విలీనం చేస్తాడు జగన్ అని కొత్త పాట మొదలెట్టాడు ఆర్కే. ముందుగా చేస్తే క్రిష్టియన్స్, ముస్లిమ్స్ ఓట్లు పడవట. అంటే 2014లో చంద్రబాబుకు ముస్లిములు, క్రిష్టియన్స్ ఓట్లేయలేదని ఆర్కే చెప్తున్నాడా? 2014 ఎన్నికలతో పాటు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా ముస్లిములు మోడీకి ఓటు వెయ్యలేదా? లేకపోతే చంద్రబాబుతో పొత్తు పెట్టకున్నంత కాలం మాత్రమే ముస్లిములు బిజెపిని నమ్ముతారా? బాబును దూరం చేసుకుంటే మోడీ ఇక మైనారిటీ వ్యతిరేకి అయిపోతాడా? ఇంతకంటే విభజన రాతలు ఇంకేమైనా ఉంటాయా? అలాంటి వాళ్ళు విభజన రాజకీయాల గురించి మాట్లాడడమా?

మోడీని ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో విలన్‌ని చేయడం, 2019 తర్వాత జగన్ పార్టీ ఉండదు అని చెప్పి సీమాంధ్రప్రజలకు చెప్పడం అనే లక్ష్యాలతో రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ సాగింది కానీ ఈ కామెంట్ చదివిన వైసిపి నాయుకులు, కార్యకర్తలు మాత్రం పండగ చేసుకోవడం ఖాయం. జగన్ పైన ఉన్న కేసులన్నింటినీ మోడీ ఎత్తేయబోతున్నాడు అన్న హింట్ ఇచ్చేశాడు రాధాకృస్ణ. అలాగే దేశంలో బాహుబలి, మగధీర రేంజ్ నాయకుడిగా మోడీ అవతరించాడని యూపీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే భజన చేసిన అదే మీడియా నుంచే ఇప్పుడు అలాంటి మోడీ చంద్రబాబుకు దూరమవుతున్నాడు, జగన్‌కి దగ్గరవుతున్నాడు అన్న వార్త వచ్చిందంటే వైసిపికి అంతకుమించిన బూస్ట్ ఇంకేముంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

ఇంకా “బలమైన” భ్రమల్లోనే కేటీఆర్ !

కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి... ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close