ఏజెంట్ లో ఏముంది ?

అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’ సినిమా ట్రైలర్ బయటికి వచ్చింది. ఇదొక సస్పై థ్రిల్లర్. జోనర్ కి తగ్గట్టే యాక్షన్, బుల్లెట్ల వర్షం కురిసింది. అఖిల్ వైల్డ్ గా కనిపించడమే కాదు అడుగడుగునా ‘వైల్డ్’ అని ప్రకటించుకున్నాడు. అంతా బాగానే వుంది కానీ తొమ్మిది నెలలు క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్ కి.. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ కి పెద్ద తేడా లేదు. ట్రైలర్ లోని ప్రతి షాట్ టీజర్ కి పొడిగింపనే అభిప్రాయాన్ని గలిగించింది తప్పితే ఏజెంట్ పై కొత్త ఆసక్తి మాత్రం రేకెత్తించలేదనే చెప్పాలి.

దర్శకుడు సురేందర్ రెడ్డి.. అఖిల్ పాత్రని లార్జర్ దెన్ లైఫ్ పాత్రగా మలిచాడని స్పష్టంగా అర్ధమౌతుంది. నిజానికి ఈ ఇమేజ్ అఖిల్ కు లేదు. అందుకే ట్రైలర్ లో చాలా చోట్ల ‘అతి’ అనిపించింది. సేఫ్ సైడ్ కి మమ్ముటి పాత్రతో ”ఇది కొంచెం ఓవర్ అనిపించడం లేదా ?’ అనే డైలాగ్ ని కూడా చెప్పించారు.

అఖిల్ చాలా కష్టపడ్డాడని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. అయితే ఇలాంటి యాక్షన్ అఖిల్ కి కొత్తగా ఉందేమో కానీ ఇలాంటి కంటెంట్ ఇప్పటికే చాలా చూసేశారు ప్రేక్షకులు. ప్రతి స్పై థ్రిల్లర్ లో వుండే యాక్షనే ఇది. తప్పితే ఎదో కొత్తగా ప్రయత్నించినట్లు మాత్రం అనిపించలేదు.

ఈ మధ్య పెద్ద మిషన్ గన్ తో క్లైమాక్స్ సెట్ చేయడం ఆనవాయితీగా మారింది. ఏజెంట్ ట్రైలర్ చివర్లో కూడా ఇలాంటి సీన్ ఒకటిపెట్టారు. కార్తి ఖైదీ, కమల్ హాసన్ విక్రమ్ లో కథతో పాటు ఈ మిషన్ గన్ పే అయ్యింది. ఏజెంట్ విషయానికి వస్తే.. అఖిల్ ఎక్స్ ప్రెషన్ చూస్తుంటే .. అందులో ఇంటన్సీసిటీ మిస్ అయ్యింది. మొత్తానికి చూసుకుంటే ఒక రెగ్యులర్ టెంప్లెట్ తో తయారైన స్పై థ్రిల్లర్ ఏజెంట్ అని ట్రైలర్ సూచిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

2 COMMENTS

Comments are closed.