ఐపోయే.. “దివాలా”నే మిగిలింది !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఐదేళ్లు పరిపాలించమని చాన్సిస్తే మొత్తం నాశనం చేసేసి నాలుగేళ్లకే దివాలా ప్రకటించే పరిస్థితి వచ్చింది. ఓ వైపు నిధులు లేవు.. ఆదాయం లేదు.. అప్పులు మాత్రం లక్షల కోట్లకు చేరాయి. మరో వైపు అధికారంలోకి రావడానికి చేసిన తప్పులు మెడకు చుట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆదుకోవాలని ఢిల్లీకి చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో అధికారుల బృందాన్ని పంపుతున్నారు.

దివాలా తీశామని పరోక్షంగా చెప్పిన సీఎస్

ఏపీ ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ నెలలో ముందస్తుగా రూ. మూడు వేల కోట్ల అప్పు ఆర్బీఐ నుంచి తెచ్చి రెండున్నర వేల కోట్ల వరకూ వేస్ అండ్ మీన్స్ వాడేసినా ..ఇప్పటికీ పెన్షనర్లకు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. మరో రూ. ఐదు వందల కోట్ల వరకూ బాకీ ఉంది. డబ్బులు లేవనే విద్యా దీవెన వాయిదా వేశామని సీఎస్ చెబుతున్నారు. ఇటీవల మీట నొక్కిన పథకాలకూ నిధులు లబ్దిదారుల ఖాతాల్లో జమ కావడం లేదు. దీంతో తమకు రావాల్సి న నిధుల కోసమంటూ సీఎస్ నేతృత్వంలో ఢిల్లీ వెళ్తున్నారు. వారి టార్గెట్ కనీసం అప్పులకు పర్మిషన్ తెచ్చుకోవడమే.

జగన్ ఢిల్లీకి వస్తే ఇక షా, మోదీ కలవడం కష్టమే

మరో వైపు సీఎం జగన్ ఢిల్లీ వస్తే మాట్లాడేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. ఎప్పుడు వచ్చినా ఆయన వ్యక్తిగత అవసరాలు.. లేకపోతే అప్పులే ఎజెండా ఉంటున్నాయి. ప్రతీ నెలలో ఒకటి, రెండు సార్లు వస్తూండటంతో మోదీ, అమిత్ షా కూడా అపాయింట్ మెంట్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపించడంలేదు. సీఎం స్థాయిలోనే సాధ్యం కాకపోతే ఇక సీఎస్ చేసేదేమీ లేదు. కేసులు వేగంగా చుట్టుముడుతూండటంతో … వైసీపీకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.

చెప్పులతో కొట్టుకుంటున్న పనులు చేసిన కాంట్రాక్టర్లు

ఓ వైపు బిగబిట్టిన బిల్లుల చెల్లింపులు.. భయపెడుతున్నాయి. సొంత పార్టీ కి చెందిన వారు బహిరంగంగా చెప్పుతో కొట్టుకుంటున్నారు. హైకోర్టు ఈ మధ్య బిల్లులు చెల్లించమని దాఖలవుతున్న పిటిషన్ల విషయంలో కాస్త వేగం తగ్గించడంతో.. కోర్టు ధిక్కరణ కేసుల్లో చెల్లింపులు తగ్గాయి….కానీ కాంట్రాక్టర్లు మాత్రం చెప్పులతో కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి వచ్చిందని… ఇక దివాలా తీయడమే మిగిలిందని.. ఏపీ ప్రభుత్వ వ్యవహారాలపై అవగాహన ఉన్న వారు సెటైర్లు వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close