ఈ రోజుల్లో వంద కోట్లు, రెండు వందల కోట్ల కలక్షన్లు అస్సలు కళ్లకు కనిపించడం లేదు. ఐదు వందల కోట్లు, వెయ్యి కోట్లు అంటేనే మనసుకు తృప్తిగా ఉంటోంది. ‘దంగల్’ రూ.2 వేల కోట్ల మార్క్‌ని మరో సినిమా దాట లేకపోయింది. అందుకోసం బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ గట్టి ప్రయత్నాలు చేశాయి. పుష్ష 2.. 1600 కోట్ల మైలు రాయి దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్ మరోసారి 2 వేల కోట్ల క్లబ్ పై గురి పెట్టాడు.
అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఐకాన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అయితే టార్గెట్ మాత్రం 2 వేల కోట్లే. పుష్ప 2 వసూళ్లని దాటేయడమే ఈ సినిమా టార్గెట్. ఈసారి దంగల్ ని కూడా మించిపోయే వసూళ్లు చూడాలన్నది ఆలోచన. బన్నీ సినిమా సూపర్ హిట్ కొడితే బాలీవుడ్ లోనూ గట్టిగా సౌండ్ చేయడం ఖాయం. కాబట్టి 2 వేల కోట్ల మార్క్ అనేది పెద్ద విషయం ఏమీ కాదు. కాకపోతే ఓవర్సీస్ మార్కెట్ పై మరింత దృష్టి పెట్టాలి. జపాన్ వంటి దేశాల నుంచి మంచి వసూళ్లు రాబట్టు కోవాలి. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ లాంటి సినిమాలు దేశ సరిహద్దులు దాటేసి ప్రపంచ వ్యాప్తంగా, చాలా భాషల్లో ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఆ ఫీట్.. అట్లీ సినిమా కూడా చేయగలగాలి. అలా చేస్తే… 2 వేల క్లబ్ లో చేరడం పెద్ద కష్టమేం కాదు.
పుష్ప కి సంబంధించిన ప్రమోషన్లు అప్పట్లో గట్టిగా చేశారు. ఐకానిక్ స్టెప్స్ ని అంతర్జాతీయ క్రీడాకారులు కూడా రీ క్రియేట్ చేసి, పుష్ప క్రేజ్ ని ప్రపంచవ్యాప్తి చేశారు. ఐకాన్ కి కూడా అలాంటి మూమెంట్ కావాలి. అందుకే ప్రమోషన్లపై కూడా ముందు నుంచే గట్టిగా గురి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ బడ్జెట్ దాదాపు రూ.100 కోట్లు ఉంటుందని ఓ అంచనా. ఇంత గట్టిగా ప్రమోట్ చేయగలిగితే.. అట్లీ ప్లాన్ వర్కవుట్ అవ్వడం ఖాయం.