27న బ‌న్నీ… 28న బాల‌య్య‌

అల్లు అర్జున్ – త్రివిక్ర‌మ్ సినిమా ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుంది..? అస‌లు వీరిద్ద‌రూ క‌ల‌సి ప‌నిచేస్తారా? ఈ సినిమా ఉందా, లేదా? అనే అనుమానాల‌కు పుల్ స్టాప్ పెట్టేయొచ్చు. ఎందుకంటే.. ఈ సినిమా ప‌ట్టాలెక్క‌డానికి రెడీగా ఉంది. ఈనెల 27న ఈ సినిమాకి కొబ్బ‌రికాయ కొడ‌తార‌ని టాక్‌. క‌థానాయిక‌గా పూజా హెగ్డే ఎంపిక ఇక లాంఛ‌న‌మే. సంగీత బాధ్య‌త‌లు త‌మ‌న్ స్వీక‌రిస్తారు.

మ‌రోవైపు నంద‌మూరి బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీ‌ను సినిమాకూ రంగం సిద్ధం అవుతోంది. ఎన్నిక‌ల‌య్యాకే షూటింగ్ మొద‌లెడ‌తారు కానీ.. ఈలోగా లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని బాల‌య్య డిసైడ్ అయ్యారు. ఈ నెల 28న హైద‌రాబాద్‌లో ఈ చిత్రానికి కొబ్బ‌రికాయ కొడ‌తారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు పూర్త‌య్యాక‌… షూటింగ్ మొద‌ల‌వుతుంది. సంగీత బాధ్య‌త‌ల్ని దేవిశ్రీ ప్ర‌సాద్‌కి అప్ప‌గించిన‌ట్టు తెలుస్తోంది. సింహా, లెజెండ్ చిత్రాల‌కు దేవినే సంగీతం అందించాడు. ఆ కాంబినేష‌న్‌ని రిపీట్ చేయించాల‌న్న‌ది బాల‌య్య ఆలోచ‌న‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close