‘అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ’ ఓ ‘అప‌రిచితుడు..’

ర‌వితేజ – శ్రీ‌నువైట్ల కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న 4వ చిత్రం `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ`. శుక్ర‌వారం విడుద‌ల అవుతోంది. టైటిల్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచీ ఈ సినిమాలో ర‌వితేజ‌లు ముగ్గురా, లేదంటే ఒక్క‌డే ముగ్గురిగా న‌టిస్తాడా? అనే ప్ర‌శ్న స‌ర్కిల్ అవుతూనే ఉంది. ఎట్ట‌కేల‌కు ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం దొరికేసింది. ఇందులో ర‌వితేజ ముగ్గురు కాదు. ఒక్క‌డే. కానీ ముగ్గురిలా న‌టిస్తాడ‌న్న‌మాట‌. అప‌రిచితుడులో విక్ర‌మ్ గుర్తున్నాడు క‌దా? ఒక్కోసారి ఒక్కోలా ప్ర‌వ‌ర్తిస్తుంటాడు. స్ప్రిట్ ప‌ర్స‌నాలిటీ అన్న‌మాట‌. స‌రిగ్గా అదే థీమ్ ఇందులోనూ అన్వ‌యించార‌ని తెలుస్తోంది. చిన్న‌ప్పుడు త‌న త‌ల్లితండ్రుల్ని దూరం చేసిన ప్ర‌తినాయ‌క బృందాన్ని.. పెద్ద‌య్యాక ఎలా అంతం చేశాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ‌. ఈ సినిమాలో ఇలియానా పాత్ర‌కూ చాలా ప్రాధాన్యం ఉంది. త‌ను కూడా ప్ర‌తీకార జ్వాల‌తో ర‌గిలిపోతుంద‌ట‌. అయితే ఆ ప్ర‌తీకారం ఎవరిపై అన్న‌ది తెర‌పై చూసి తెలుసుకోవాలి. స్ప్రిట్ ప‌ర్స‌నాలిటీ డిజార్డ‌ర్‌తో చాలా సినిమాలొచ్చాయి. అప‌రిచితుడిలా అవేం హిట్లు అందుకోలేదు. అయితే ఇలాంటి పాత్ర చేయ‌డం ర‌వితేజ‌కు కొత్త‌. మ‌రి… ఈ మాస్ మ‌హారాజ్ దానికి ఎంత వ‌ర‌కూ న్యాయం చేశాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ కు ఏమైంది..?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రసంగం అనగానే తెలంగాణ ప్రజలంతా చెవులు రిక్కించి వినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇదంతా గతం. అధికారం కోల్పోయాక ఆయన ప్రసంగంలో మునుపటి వాగ్ధాటి కనిపించడం లేదనే అభిప్రాయాలు...

బొత్స తండ్రి సమానుడా ? : షర్మిల

వైఎస్ జగన్ బొత్సను తన తండ్రి సమానుడు అని అనడం.. ఆయన విచిత్రమైన హావభావాలతో కంట తడిపెట్టుకున్నట్లుగా నటించడం, తర్వాత కాళ్లకు దండం పెట్టే ప్రయత్నం చేయడం విజయనగరం సిద్ధం సభలో కనిపించిన...

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close