అంబటి రాంబాబకు మరోసారి రిమాండ్ వేయించడంలో వైసీపీ ఏస్ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సక్సెస్ అయ్యారు. సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా కేసులో ఆయనకు పధ్నాలుగు రోజులు రిమాండ్ విధించారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి హోరాహోరీగా చేసిన వాదనల్ని న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో మళ్లీ రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. ఉదయం ఆయనను కోర్టులో హాజరు పరిచినప్పుడు.. తగ్గదే లేదని హంగామా చేశారు. ఇప్పుడు ఆయనను తగ్గకుండా మళ్లీ జైలుకు పంపిస్తున్నారు.
మంత్రిగా ఉన్నప్పుడు సత్తెనపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన వైఎస్సార్ సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో అక్రమంగా లాటరీ టిక్కెట్లు విక్రయించారు. అది కూడా పెన్షన్లు తీసుకునే వారి వద్ద బలవంతంగా వారి పెన్షన్ల నుంచి మినహాయించి వసూలుచేశారు. ఇందు కోసంస వాలంటీర్లను వాడుకున్నారు. జనసేన నేత ఫిర్యాదు చేసినా అప్పట్లో పోలీసులు పట్టించుకోలేదు కానీ ఆయన కోర్టుకెళ్లి కేసు నమోదు చేయించారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ కేసు బయటకు వచ్చింది.
చంద్రబాబును దూషించిన కేసులో ఆయన మొదట జైలుకు వెళ్లారు. ఆ కేసులో బెయిల్ రాగానే .. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో పీటీ వారెంట్ ద్వారా అరెస్టు చేశారు. ఆ కేసులో బెయిల్ రాగానే లక్కీ డ్రా కేసులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ కేసులో ఆయన బెయిల్ పిటిషన్ వేసుకుని బయటకు వచ్చే సరికి.. మరో కేసు ఏమైనా ఉంటే అందులోనూ పీటీ వారెంట్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి.