అనసూయ ఐటెం కాదండీబాబూ

నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయన’లో… హాట్ హాట్ గా ముస్తాబై వెండితెర ముందుకు వ‌చ్చింది ‘జ‌బ‌ర్‌ద‌స్త్’ అన‌సూయ‌. అయితే అది చెప్పుకునే అంత పాత్ర కాదు. కాని సినిమా హిట్. ఆ త‌ర‌వాత క్ష‌ణంలో సీరియ‌స్ గా సాగే పాత్ర‌లో క‌నిపించింది. ఆ సినిమా కూడా హిట్టే. దాంతో రెండు హిట్ సినిమాల్లో కనిపించిన క్రెడిట్ ఆమెకు దక్కింది. క్షణం తర్వాత ఆమె నుండి మరో సినిమా రాలేదు. అయితే మొన్న సాయి ధరమ్ తేజ్ విన్నర్ ఓ ఐటెం పాటలో మెరిసింది అనసూయ. ఇప్పుడు మరో మెగా ఆఫర్ కొట్టేసింది.

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో అనసూయను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఐటెం సాంగ్ కోసమని ప్రచారం జరిగింది. ఇప్పుడు దీనిపై యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా మొత్తం అనసూయ కనిపిస్తుందని, అమెది ఐటెం రోల్ కాదని, కధలో చాలా కీలక పాత్రని స్పష్టంచేసింది. పల్లెటూరి నేపధ్యంలో సాగనున్న చిత్రమిది. చరణ్ కు జోడీగా సమంత నటిస్తోంది. ఇప్పటికే ఒక షెడ్యుల్ పూర్తి కావస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close