వ్య‌క్తి పూజ కోరుకుంటున్న కేసీఆర్‌..!

పొగ‌డ్త‌లు ఎవ‌రికి మాత్రం చేదు చెప్పండీ..! ఒక వ్య‌క్తిని వీరుడూ శూరుడూ దేవుడూ అనే రేంజిలో మోసేస్తుంటే… వింటున్న ఆ వ్య‌క్తికి భ‌లే మ‌జా ఉంటుంది క‌దా. అయితే, ఆ మజాని ఆశ్వాదిస్తున్న‌ట్టు అంద‌రికీ తెలియ‌కూడ‌దు క‌దా! పొగ‌డ్త‌ల‌కి మ‌రీ పొంగిపోకూడ‌దు, లొంగిపోకూడ‌దు అని పెద్ద‌లు చెబుతూ ఉంటారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరు చూస్తుంటే.. భ‌జ‌న‌ని బాగానే ఎంజాయ్ చేస్తున్నారంటూ కొంత‌మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఈ మ‌ధ్య‌నే ముఖ్య‌మంత్రి కేసీఆర్ కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. నిజానికి, గ‌డ‌చిన కొద్ది నెల‌లుగా వ‌రుస‌గా తెరాస స‌ర్కారు చుట్టూ ర‌క‌ర‌కాల విమ‌ర్శ‌లు ముసురుకున్నాయి. ఫిరాయింపులపై విమ‌ర్శ‌లు, ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌పై కోర్టు మొట్టికాయ‌లు, ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతిపై విమ‌ర్శ‌లు… ఇలా తెరాస కాస్త ఉక్కిరిబిక్కిరైంది. కానీ, బ‌డ్జెట్ త‌రువాత ప‌రిస్థితి మ‌ళ్లీ మార్చేశారు కేసీఆర్‌! బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు ప్రాధాన్య‌త అంటూ వ‌రాలు కురిపించారు. గోదావ‌రి జాలాల‌కు సంబంధించి మ‌హారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రైతుల‌కు ఎరువులు ఉచితంగా ఇస్తామంటూ ప్ర‌క‌టించారు. సో.. ఈ నిర్ణ‌యాల నేప‌థ్యంలో మ‌రోసారి కేసీఆర్ అనుకూల ప్ర‌చారం భారీగా పెరిగింది. ఏ స్థాయిలో అంటే.. ముఖ్య‌మంత్రికి పాలాభిషేకాలు చేసే రేంజిలో..!

ఈ మ‌ధ్య కేసీఆర్ కి పాలాభిషేకాలు పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే, వీట‌న్నింటినీ ఒక మంత్రి చేయిస్తున్నారంటూ ఓ క‌థ‌నం చ‌క్క‌ర్లు కొడుతోంది. అయితే, ఈ పాలాభిషేకాలు ముఖ్య‌మంత్రి దృష్టికీ వ‌చ్చాయ‌నీ, ఆయ‌న కూడా దీనికి అడ్డు చెప్ప‌లేద‌ని తెలుస్తోంది. దీంతో ఇత‌ర నాయ‌కులు కూడా రెచ్చిపోయి పాలు పోసుస్తున్నార‌ట‌! ఇలాంటి వృధా ప్ర‌య‌త్నాలు కొంత‌మందికి ఇష్టం లేక‌పోయినా… ఇత‌ర నాయ‌కులు చేస్తున్నారు కాబ‌ట్టి, త‌మ‌కీ త‌ప్ప‌డం లేదంటూ కొంత‌మంది నాయ‌కులు ఆఫ్ ద రికార్డ్ వాపోతున్నార‌ట‌.

నిజానికి, ఇలాంటి వ్య‌క్తిపూజ‌లకి సీఎం ఫుల్ స్టాప్ పెట్టాలి. కానీ, ఆయ‌నే దీన్ని ఎంజాయ్ చేస్తున్న‌ట్టు సంకేతాలు ఇవ్వ‌డం ఎంత‌వ‌ర‌కూ క‌రెక్ట్‌..? ఈ పాలాభిషేకాల వ‌ల్ల ఎంతో విలువైన పాలు అన‌వ‌స‌రంగా నేల‌పాలు అవుతున్నాయి. వీటిని పేద‌వారికి పంచితే ఉప‌యోగం ఉండేది. ఈ పాలాభిషేకాల్ని సీఎం అలా డైవ‌ర్ట్ చేస్తే బాగుంటుంది. కానీ, కేసీఆర్ తీరు అలా ఉన్న‌ట్టు లేదే..! పొగ‌డ్త‌ల్ని, అభిషేకాల్నీ, భ‌జ‌న‌ల్ని ప్రోత్స‌హించే మూడ్ లో ఉన్న‌ట్టున్నారు. దీన్ని కూడా పార్టీ ప్ర‌చారానికి వాడుకునేలా ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close