అనుష్క ‘ఘాటి’ ప్రమోషన్స్‌లో కనిపించడం లేదు కానీ వినిపిస్తోంది. ఫోన్లోనే సినిమా గురించి ప్రచారం చేస్తోంది. తాజాగా మరో ఇంటర్వ్యూ ఇచ్చింది. ‘ఘాటి’లో చేసిన శీలావతి క్యారెక్టర్ తన ఫిల్మోగ్రఫీలో నిలిచిపోతుందని చెప్పింది. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి… తర్వాత అంతటి బలమైన పాత్ర శీలావతి. క్రిష్ గారు సరోజలాంటి క్లాసిక్ క్యారెక్టర్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ శీలావతి లాంటి గొప్ప పాత్రని రాశారు. క్రిష్ గారి సెన్సిబిలిటీస్ ఈ పాత్ర ప్రేక్షకులు గుర్తుండిపోతుందని చెప్పింది స్వీటీ.
అనుష్క ఎప్పుడు మీడియా టచ్‌లోకి వచ్చినా ప్రభాస్ ప్రస్తావన వస్తుంది. ప్రభాస్‌తో తన స్పెషల్ కెమిస్ట్రీ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. “నేను ప్రభాస్ వెండితెరపై అంత స్పెషల్‌గా కనిపించడానికి కారణం… కథ, క్యారెక్టర్స్‌ని రాసిన విధానం. దీంతో పాటు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. స్నేహంలో ఒక కంఫర్ట్ ఉంటుంది. అది కూడా హెల్ప్ అవుతుంది. ఏదేమైనా సరైన క్యారెక్టర్స్, కథ ఉంటేనే కెమిస్ట్రీ పండుతుంది” అని చెప్పుకొచ్చింది దేవసేన.
ప్రస్తుతం అనుష్క ఎక్కడ కనిపించడం లేదు. ఇంట్లో వాళ్ల పెళ్లికి కూడా వెళ్ళడం లేదు. మరి తన సమయాన్ని ఎలా గడుపుతుందనే ప్రశ్నకు సమాధానం దొరికింది. “నేను చాలా ట్రావెల్ చేస్తున్నాను. అన్ని ప్రదేశాలు తిరుగుతున్నాను. మహాభారతం చదవడం మొదలుపెట్టాను. నచ్చిన సినిమాలు ఎక్కువగా చూస్తున్నాను. ముఖ్యంగా ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడుపుతున్నాను” అని చెప్పిన అనుష్క… త్వరలోనే అందరి ముందుకు వస్తానని, తెలుగులో ఓ కొత్త సినిమా అనౌన్స్మెంట్ కూడా రాబోతుందని రివిల్ చేసింది.