బీజేపీ నేతలపై కోర్టు ధిక్కార పిటిషన్లు..! అగ్రిగోల్డ్ ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం..!

అగ్రిగోల్డ్ విషయంలో బీజేపీపై అగ్రెసివ్ గా వెళ్లాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. వరుసగా ధర్నాలు చేస్తూ.. అగ్రిగోల్డ్ ఆస్తులను టీడీపీ నేతలు స్వాహా చేస్తున్నారన్నట్లుగా ఆరోపణలు చేస్తూండటాన్ని ఏ మాత్రం.. సహించకూడదని.. నిర్ణయించింది. నేరుగా ఆరోపణలు చేసిన వారందరిపై కోర్టు ధిక్కార పిటిషన్లు వేయబోతున్నారు. ఇది పార్టీ పరంగా కాకుండా.. కేసు దర్యాప్తు చేస్తున్న సీఐజీ ద్వారానే వేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్న .. బీజేపీ నేతలపై కోర్టు ధిక్కార పిటిషన్‌ వేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది.
హైకోర్టు పర్యవేక్షణలో అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలం జరుగుతుండగా .. ఆరోపణలు చేయడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. కోర్టు పర్యవేక్షణలోనే పూర్తిస్థాయిలో అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం వేస్తున్నారని.. కోర్టుకు దురుద్దేశాలు ఆపాదించే విధంగా .. బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాన్ని మంత్రులు వ్యక్తం చేశారు. దర్యాప్తు చేస్తున్న సీఐడీతోనే కోర్టు ధిక్కార పిటిషన్‌ వేయించనున్నారు. అగ్రిగోల్డ్ కు సంబంధించి ప్రతి వ్యవహారం కోర్టు ద్వారానే నడుస్తోంది. గతంలో జీఎస్సెల్ సంస్థ టేకోవర్ కు ముందుకొచ్చినా.. అది కూడా కోర్టు పరిశీలన ద్వారా ప్రక్రియ జరిగింది. అయితే చివరికి జీఎస్సెస్ సంస్థ చేతులెత్తేసింది. దీంతో.. ఇప్పుడు సీఐడీ ద్వారా వేలానికి రంగం సిద్ధమయింది. ఇదంతా కోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది. ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు.
అయినప్పటికీ.. బీజేపీ నేతలు ఇప్పుడు దీన్నో రాజకీయ అంశంగా చేసుకుని.. ఆరోపణలు చేయడానికి సిద్ధమైపోవడంతో… ఎదురుదాడి చేయాలని టీడీపీ నిర్ణయించింది. నేరుగా కోర్టు ధిక్కరణ పిటిషన్లే వేయబోతూండటం కాస్త సంచలనం కలిగించేదే. కోర్టు ఈ రాజకీయ ఆరోపణల్ని సీరియస్ గా తీసుకంటే బీజేపీ నేతలకు చిక్కులు తప్పకపోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close