ఫిర్యాదులు లేకుండా సోదాలా..? సిట్‌కు మొదటి షాక్..!?

టీడీపీ హయాంలో అక్రమాలంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ కతొలి విచారణలు తుస్సుమంటున్నాయి. రఘునాథరెడ్డి అనే ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ముందుగా.. రాజధానిలో భూముల కొనుగోళ్ల పై దృష్టి సారించింది. కొద్ది రోజుల కిందట… బెదిరించి అసైన్డ్ భూములు కొనుగోలు చేశారంటూ..సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ కేసులను పరిశీలనలోకి తీసుకున్న సిట్… నాలుగైదు రోజుల కిందట సోదాలు ప్రారంభించింది. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బినామీలంటూ… కృష్ణా, గుంటూరు జిల్లాలో కొంత మంది ఇళ్లపై దాడులు చేసిన సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. వారిలో కొంత మంది హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఎవరూ ఫిర్యాదు చేయకుండా.. సీఐడీ కేసు నమోదు చేసి..సోదాలు చేయడం ఏమిటని హైకోర్టు ప్రశ్నిస్తూ… ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలని ఆదేశించింది. అసైన్డ్ భూములు కొనుగోలు చేశారంటూ.. మంగళగిరిలో సీఐడీ నమోదు చేసిన కేసులో అన్ని రకాల ప్రోసిడింగ్స్‌ నిలిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. తమపై అకారణంగా సీఐడీ కేసు నమోదు చేసిందని కంచికచర్లకు చెందిన నన్నపనేని సీతారామరాజు, కృష్ణమూర్తి హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీరి ఇళ్లలో సిట్ సోదాలు చేసిది. తాము ఎలాంటి అసైన్డ్ భూములు కొనలేదని పిటిషనర్లు కోర్టుకు చెప్పారు. ఎవరూ ఫిర్యాదు చేయకుండా ఎలా సోదాలు చేస్తారని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

ప్రోసిడింగ్స్ నిలిపివేయాలని ఆదేశించింది. ఎవరూ ఫిర్యాదు చేయకుండా.. కేసులు నమోదు చేస్తూ.. సీఐడీ అధికారులు కొత్త సంప్రదాయాల్ని నెలకొల్పుతున్న వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. గత ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ విచారించడానికి సిట్ ఏర్పాటయింది. ఇప్పుడు..సిట్ ప్రత్యేకంగా కేసులు నమోదు చేయడానికి అవకాశం లేకుండా పోయింది.ఫిర్యాదులు లేకుండా కేసులు లేకుండా సోదాలు నిర్వహిస్తే.. అది చట్ట ఉల్లంఘన అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close