టీఆర్ఎస్‌పై కాకుండా బీజేపీతో పోరాడుతున్న భట్టి విక్రమార్క !

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు .. కూర్చుని తమ స్ట్రాటజీని మాట్లాడుకుంటారో లేదో కానీ ఎవరి వాదన వారు వినిపిస్తూ ఉంటారు. అసెంబ్లీలో మల్లు భట్టి విక్రమార్క చేసిన ప్రసంగం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనే కాదు.. ఇతర పార్టీల్లోనూ చర్చనీయాంశంగా మారుతోంది. అసెంబ్లీలో ఏ మాత్రం బలం లేని బీజేపీపై ఒంటికాలితో లేచిన భట్టి విక్రమార్క.. రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చే సరికి.. సలహాలు.. సూచనలతో సరి పెట్టారు. ఆయన తీరు చూసి బీజేపీ నేతలు కూడా ముందుగా రేవంత్ రెడ్డి… తమ విధానమేంటో భట్టికి చెప్పాలని సెటైర్ వేశారు. బీజేపీ విధానాలపై కేసీఆర్ అసెంబ్లీలో తీవ్రంగా విమర్శించారు.

నిజానికి రాష్ట్ర సమస్యలపై చర్చించాలి కానీ కేసీఆర్ జాతీయ రాజకీయ కోణంలో అసెంబ్లీలో ప్రసంగించారు. ఈ ప్రసంగానికి మద్దతన్నట్లుగా భట్టి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడాల్సిన సమస్యలు కాంగ్రెస్ పార్టీ వద్ద చాలా ఉన్నాయి. కానీ భట్టి విక్రమార్క అవన్నీ పట్టించుకోలేదు.భట్టి ప్రసంగం చూసిన వారికి.., కాంగ్రెస్ పార్టీ.. టీఆర్ఎస్ తో కలిసి పోటీ చేస్తుందేమో అన్న సెటైర్లు సోషల్ మీడియాలో వేశారంటే అతిశక్తి కాదు.

రాహుల్ పాదయాత్ర ప్రారంభంలో కొంత మంది సీనియర్ నేతలు టీఆర్ఎస్‌ను కలుపుకుని వెళ్తామని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో భట్టి ప్రసంగం కూడా దానికి తోడైంది. కేసీఆర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ పదవి నుంచి దింపాలని కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు రావాలని .. సర్వశక్తులు ఒడ్డుతున్న రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు.. సీనియర్ నేతల వ్యవహారశైలితోనూ పోరాడాల్సి వస్తోంది. టీఆర్ఎస్‌పై కాంగ్రెస్ పోరాటం .,. లైట్ కాకుండా చూసుకోవాల్సి వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close