తిరుపతి మున్సిపాలిటీలో టీడీఆర్ స్కామ్ చేసి వందల కోట్లు దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు తెరలేపారు. తనపై విచారణ పూర్తి అయిందని అక్రమాలు అన్నీ బయట పడ్డాయని అనుకుంటున్నారేమో కానీ సంబంధింతి మంత్రి, మహిళా ఐఏఎస్ అధికారిపై రివర్స్ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారు.
నాలుగు రోజుల కిందట ప్రెస్ మీట్ పెట్టి ఓ మంత్రి హైదరాబాద్ హోటల్లో రాసలీలలు అంటూ.. సొల్లు కబుర్లు చెప్పారు. దాన్ని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసింది. వైసీపీ మీడియా కూడా హైలెట్ చేసింది. తాజాగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై ఆరోపణలు చేశారు. టీడీపీ బాండ్ల విషయంలో ఆమె చేసిన స్కామ్ చాలా పెద్దదని వేల కోట్ల రూపాయలు దోచేసుకున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో ఆమెను కట్టడి చేశామని చెప్పుకొచ్చారు.
భూమన ఆరోపణలు చూస్తూంటే.. తాను చేసిన టీడీపీ స్కామ్లో పూర్తి వివరాలు.. అక్రమాలు అన్నీ బయటకు వస్తాయన్న భయంతో.. వారిపై ఆరోపణలు చేస్తున్నారని సులువుగా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత ప్రభుత్వం ఆషామాషీగా ఏదీ చేయడం లేదు. వైసీపీ నేతలు చేసిన తప్పులను పక్కా సాక్ష్యాలతో సహా బయట పెట్టి చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు భూమన వంతు వచ్చిందన్న ప్రచారంతో ఆయన ఈ రివర్స్ ఆరోపణలు చేస్తున్నారు.
భూమన కరుణాకర్ రెడ్డి ఒకప్పుడు జిరాక్స్ షాప్ నడిపేవారు. నక్సలైట్ గ్రూపుల్లో పని చేసేవారు. వైఎస్ కుటుంబానికి సన్నిహితమయిన తర్వాత తిరుపతిలో ఆయన ధనవంతుడయ్యారు. ఏ వ్యాపారం చేయని ఆయనకు వందల కోట్ల ఆస్తి ఎలా వచ్చిందో మాత్రం ఎవరికీ తెలియదు. ఇప్పుడు అది బయటపడుతుందని. మంత్రులపై, ఐఏఎస్ ఆఫీసర్లపై బ్లాక్మెయిలింగ్ కు పాల్పడుతున్నారు. కానీ జరగాల్సినవి జరగకుండా ఉంటాయా ?