సానియా మీర్జాకు కొంచెం దుఃఖం, కొంచెం ఆనందం!!

సానియా మీర్జాకు కొంచెం దుఃఖం , కొంచెం ఆంనదం కలిగే పరిస్థితి ఎందుకు వచ్చిందబ్బా అని ఆశ్చర్యం కలుగుతోంది కదా. సానియా జంట డబుల్స్‌ జైత్రయాత్రలో ఆ మధ్యన పరాభవం ఎదురై కూడా చాలారోజులు గడచిపోయాయి కదా.. ఇప్పుడు దుఃఖం ఎందుకు కలిగినట్టా అనుకుంటున్నారు కదా..? ఈ దుఃఖం ఆమె ఓడిపోవడం వల్లనో, లేదా మరో కారణం వల్లనో కలిగింది కాదు..! ఆమె భర్త షోయబ్‌ మాలిక్‌తో ముడిపడినట్టింది.

శనివారం నాడు భారత- పాకిస్తాన్‌ల మధ్య ఢాకా మిర్పూర్‌లో టీ20 మ్యాచ్‌ జరిగిన సంగతి అందరికీ తెలిసిదే. ఈ మ్యాచ్‌కు ముందు సానియా మీర్జా భర్త, పాకిస్తాన్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌ మీడియాతో తన ముచ్చట్లు పంచుకుంటూ.. సానియా మాత్రం భారత్‌ విజయం సాధించాలని, భర్తగా తాను మంచి పెర్ఫార్మెన్స్‌ చూపించాలని కోరుకుంటుందని చెప్పుకొచ్చారు. భారతదేశపు ఆడపడుచుగా తన సొంత దేశ విజయాన్ని కాంక్షించడమూ, పాకిస్తాన్‌ కోడలు అయినప్పటికీ.. భర్త బాగా ఆడాలని కోరుకోవడమూ ఆ రకంగా సబబే అన్నట్లుగా షోయబ్‌ చెప్పారు. బాగానే ఉంది.

కానీ శనివారం నాటి మ్యాచ్‌లో ఇలాంటి డబుల్‌ బొనాంజా సానియాకు దక్కలేదు. భారత్‌ విజయం సాధించింది. షోయబ్‌ మాటలు నిజమే అనుకుంటే గనుక.. ఆ విజయం సానియాకు ఆనందం కలిగించే ఉంటుంది. కానీ ఆమె దుఃఖ కారణం మాత్రం భర్తే. పాకిస్తాన్‌ బ్యాట్స్‌మెన్‌గా షోయబ్‌ ఈ మ్యాచ్‌లో విఫలం అయ్యాడు. తను కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. అందుకే పాపం.. శనివారం మ్యాచ్‌ సానియాకు కొంచెం మోదం.. కొంచెం ఖేదం కలిగించిందని అనుకోవాలి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close