సి.క‌ల్యాణ్‌… ఒకే రోజు మూడు సినిమాలు

నిర్మాత‌గా అప్పుడ‌ప్పుడూ మెరిసే వ్య‌క్తి సి.క‌ల్యాణ్‌. `ఇంటిలిజెంట్‌` త‌ర‌వాత మ‌రో సినిమా చేయ‌లేదు. `ల‌క్ష్మి`కి భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రించారు. అయితే డ‌బ్బులు మాత్రం ఆయ‌న‌వి కావు. ఇప్పుడు ఒకేసారి మూడు సినిమాలు ప‌ట్టాలెక్కించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. విజ‌య‌ద‌శ‌మి రోజున మూడు సినిమాల్నీ ఒకేరోజు ప్రారంభిస్తార్ట‌. అందులో ఒక‌టి రాజ‌శేఖర్ తో ఉంటుంది. `అ`తో ఆక‌ట్టుకున్న ప్ర‌శాంత్ వ‌ర్మ తీస్తున్న `క‌ల్కి`కి సి.క‌ల్యాణ్ నిర్మాత‌. వీటితో పాటు మ‌రో రెండు కొత్త చిత్రాల్ని ఆయ‌న తెర‌కెక్కించ‌బోతున్నారు. హీరోలెవ‌రు? ద‌ర్శ‌కులెవ‌రు? అనేది ఆ రోజే చెబుతారు. నంద‌మూరి బాల‌కృష్ణ – వినాయ‌క్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా చేయ‌డానికి ఆయ‌నెప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నిస్తున్నారు. వినాయ‌క్ క‌థ సిద్ధం చేయ‌లేక‌పోవ‌డం వ‌ల్ల అది ఆల‌స్య‌మ‌వుతోంది. బాల‌య్య‌తో సినిమా ఉంటుందా? లేదంటే దాన్ని ప‌క్క‌న పెట్టేశారా? అనే విష‌యాల్లోనూ ద‌స‌రా లోపు క్లారిటీ వ‌చ్చేస్తుంది. హీరో మారినా వినాయ‌క్‌తో మాత్రం ఓ సినిమా ఉంటుంది. `ఇంటిలిజెంట్‌` న‌ష్టాల్ని భ‌ర్తీ చేసుకోవాలి క‌దా మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com