వైకాపా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై కేసులు నమోదు

మొన్న చింతపల్లిలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ నిర్వహించిన బహిరంగ సభలో వైకాపా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తన పార్టీ అధ్యక్షుడుని మెప్పించడానికో లేక ప్రజలను ఆకట్టుకోవడానికో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నోటికి వచ్చినట్లు చాలా అభ్యంతరకరంగా మాట్లాడారు. అంతే కాదు విశాఖ ఏజన్సీ ఏరియాలో చంద్రబాబు నాయుడు కాలుపెడితే ఆయన తల నరుకుతానని హెచ్చరించారు. భాద్యతాయుతంగా మాట్లాడవలసిన తన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే పక్కనే నిలబడి ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆమె మాటలను ఖండించలేదు సరికదా ముసిముసినవ్వులు నవ్వారు. స్థానిక తెదేపా నేతల పిర్యాదుల మేరకు ఆమెపై అరకు, పాడేరు మరియు చింతపల్లి పోలీస్ స్టేషన్లలో సెక్షన్స్: 505(1) (బి) ; 506(2); 511; 124 (ఏ) రెడ్ విత్ 307క్రింద కేసులు నమోదు చేసారు. న్యాయసలహా తీసుకొన్న తరువాత పోలీసులు ఈరోజు ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]