చైతన్య : అమ్మ లాంటి ఆంధ్రాకు ఓటేద్దాం..! జన్మభూమిని గెలిపిద్దాం..!

అమ్మ, ఆవకాయ, ఆంధ్రప్రదేశ్… ఏ దేశమేగినా… ఏ ప్రాంతానికి పోయినా… ఆంధ్రులకు ఈ మూడు పంచప్రాణాలే. అమ్మకు కష్టం రాకుండా ఎలా చూసుకుంటారో… ఆంధ్రప్రదేశ్‌ కూ అంతే. అమెరికా పోయి మూడు దశాబ్దాలు దాటిపోయినా… అమెరికా కన్నా.. ఆంధ్రాలో ఏం జరుగుతుందో.. తెలుసుకోవడానికే ఆంధ్రులు ఆసక్తి చూపిస్తారు. కడప ఎన్నారై అయినా… సిక్కోలు చిన్నోడయినా… అమెరికాలో ఉన్నా… హైదరాబాద్ లో ఉన్నా.. తమ రాష్ట్రం.. తమ ఊరు ఎలా ఉంది… అనే భావననే మొదట మనసులో తెచ్చుకుంటారు. అది అవినావబంధం. విడదీనదీయలేనిది. మనసుతో ముడిపడిపోయింది.

అమ్మ.. ఆవకాయ.. ఆంధ్రప్రదేశ్..! ఈ మూడే పంచ ప్రాణాలు..!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రులందరి దృష్టి ఇప్పుడు సొంత రాష్ట్రంపై ఉంది. ఒకప్పుడు.. మద్రాస్ రాష్ట్రం నుంచి.. భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో విడగొట్టారు. కర్నూలును రాజధాని చేసుకుని కూడా… భవనాలు ఉన్నాయన్న కారణంగా.. హైదరాబాద్‌ను రాజధాని చేశారు. చివరికి.. ఆంధ్రులంతా రెక్కలు ముక్కలు చేసుకుని… హైదరాబాద్ మనది… మనందరిది అని.. ఆంధ్రులంతా అనుకునేసరికి.. ఆంధ్రులు వేరు.. తెలంగాణ వేరు అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఆంధ్రులకు అస్థిత్వ సమస్య వచ్చింది. నాడు మద్రాస్ కోల్పోయాం.. ఇప్పుడు హైదరాబాద్‌ను పోగొట్టుకున్నాం. ఇక ఆంధ్రాకు ఏముంది..? అనే నిరాశకర పరిస్థితి నుంచి… ఆంధ్రుల గర్వంగా తలెత్తుకోగలమన్న నమ్మకాన్ని ఐదేళ్లలో తెచ్చుకున్నారు. అందుకే.. అప్పుడు కోల్పోయిన ఆత్మవిశ్వాసం ఇప్పుడు తొణికిసలాడుతోంది.

ఆంధ్రుల చైతన్యానికి వెలకట్టలేం..!

సంక్రాంతి పండుగకు దేశవిదేశాల నుంచి ఆంధ్రులు తరలి వస్తారు. కానీ ఓట్లక కోసం.. ఆ స్థాయిలో వెళ్లేవాళ్లు గతంలో తక్కువ. ఎందుకంటే… హైదరాబాద్ లాంటి చోట్ల స్థిరపడిన వారు… ఆంధ్రప్రదేశ్ అనే విశాల భావనతో… అక్కడే ఓటు హక్కు వినియోగించుకునేవారు. కానీ ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత అత్యధికులు.. తమ ఓటును ఏపీలో నమోదు చేయించుకున్నారు. తమ రాష్ట్ర భవిష్యత్ కోసం.. ఓ మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి.. ఓ రకమైన భావోద్వేగంతో ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ నుంచి లక్షలాదిగా తరలి వెళ్లిన జనసందోహం… ఇదే చెబుతోంది..

ఓటేద్దాం.. ఆంధ్రాని గెలిపిద్దాం…!

ఆంధ్రులకు ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. కష్టపడే గుణం వారి సొంతం. సొంత కష్టంపై ఎదుగడం వారి ఆత్మాభిమానం. ఐదేళ్లలో తాము చూసిన అభివృద్ధి వారిలో.. ఈ ఆత్మాభిమానాన్ని రెట్టింపు చేసింది. ఓ రకమైన భావోద్వేగం వారిలో కనిపిస్తోంది. అందరిలోనూ… ఒకటే భావన.. మన రాష్ట్రం.. మన ప్రదేశ్. ఓటేద్దాం.. ఏపీని గెలిపిద్దాం.. అనే ఆలోచనే..!.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close