జగన్‌ పిటిషన్‌ను వ్యతిరేకించిన సీబీఐ..!

అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టులో హాజరయ్యే విషయంలో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్ విచారణ … ఏప్రిల్ 9వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కౌంటర్‌లో సీబీఐ…జగన్ కు వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. కౌంటర్‌లో కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలు ప్రస్తావించడమే కాదు.. చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొన్నట్లు సమాచారం. సీబీఐ కౌంటర్‌పై వాదనలను ఏప్రిల్ 9వ తేదీన వింటామని… హైకోర్టు చెప్పింది.

ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరవ్వాల్సిన పరిస్థితిలో ప్రజాసేవకు ఇబ్బంది ఎదురవుతుందన్న ఉద్దేశంతో.. జగన్… మినహాయింపు కోసం పిటిషన్‌ వేశారు. అయితే….సీబీఐ కోర్టు పర్మిషన్ ఇవ్వలేదు. తర్వాత ఈడీ కేసుల్లోనూ.. న్యాయస్థానం.. తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఒక వేళ సీబీఐ కేసుల్లో.. మినహాయింపు దక్కినా.. ఈడీ కేసుల్లో కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఈడీ కోర్టు తీర్పుపైనా జగన్.. హైకోర్టులో పిటిషన్ వేసుకున్నా.. అనూహ్యంగా వెనక్కి తీసుకున్నారు. మళ్లీ వేయలేదు. హైకోర్టులో ఏదీ తేలకపోవడంతో.. జగన్మోహన్ రెడ్డి ఇక తప్పనిసరిగా ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి.

గత వారం ఆయన కోర్టుకు వెళ్లేందుకు సిద్దమయ్యారు కానీ.. న్యాయమూర్తి సెలవు పెట్టడంతో.. చివరి క్షణంలో ఆగిపోయారు. హైకోర్టులో కూడా సీబీఐ… జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపును వ్యతిరేకిస్తూ.. కౌంటర్ దాఖలు చేయడంతో అక్కడ సానుకూల ఫలితం వచ్చే అవకాశాలపై సందేహాలు నెలకొన్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close