రైతుల‌తో క‌లిసి పోరాటానికి రేవంత్ రెడ్డి సిద్ధం!

రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల్లో రైతుబంధు ఒక‌టి. అయితే, ఇప్పుడు ర‌క‌ర‌కాల కార‌ణాలతో రైతుబంధు సాయానికి కోత‌లు పెడుతున్నార‌ని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. అర్హులైన‌వారికి ప‌థ‌కం వ‌ర్తింప‌జేయ‌డం లేద‌నీ, అధికారుల త‌ప్పిదాల వ‌ల్ల చాలామందికి ఈ సాయం అంద‌డం లేద‌ని విమ‌ర్శిస్తున్నారు. రైతు రుణ‌మాఫీ అమ‌లు, మ‌ద్ద‌తు ధ‌ర‌ల నిర్ణ‌యం వంటి అంశాల‌పై కూడా ఇలాంటి విమ‌ర్శ‌లే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ కి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఒక లేఖ రాశారు. రైతుబంధు ప‌థ‌కం కేవ‌లం ఎన్నిక‌ల ప‌థ‌కంగా మార్చేశారంటూ విమ‌ర్శించారు. రైతు స‌మన్వ‌య క‌మిటీ కూడా కొంత‌మందికి పున‌రావాస కేంద్రంగా మారిపోయింద‌ని ఆరోపించారు.

రైతుల‌కు ప్ర‌భుత్వం చాలా హామీలు ఇచ్చింద‌నీ, అమ‌లు ద‌గ్గ‌ర‌కి వ‌చ్చేస‌రికి ఆ ఊపు క‌నిపించ‌డం లేద‌నీ, రాబోయే బ‌డ్జెట్లో రైతులకు ఇచ్చిన హామీల‌న్నింటికీ నిధులు కేటాయించాల‌న్నారు. రైతు రుణ‌మాఫీని కూడా ఆర్భాటంగా ప్రారంభించార‌నీ, దాన్నీ స‌క్ర‌మంగా అమ‌లు చేయ‌డం లేద‌న్నారు రేవంత్ రెడ్డి. మ‌ద్ద‌తు ధ‌ర‌ను ఎప్ప‌ట్నుంచీ ప్ర‌క‌టిస్తారో ముఖ్య‌మంత్రి చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రైతుల‌కు ఈ ప్ర‌భుత్వం న్యాయం చెయ్య‌క‌పోతే వారితో క‌లిసి త్వ‌ర‌లో తాను ఉద్య‌మించాల్సి ఉంటుంద‌ని లేఖ‌లో రేవంత్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో 58 ల‌క్ష‌ల రైతులుంటే, 41 ల‌క్ష‌ల మందికి మాత్ర‌మే రైతుబంధు ఆర్థిక సాయం అందుతోంది. ఖ‌రీఫ్‌, ర‌బీ సీజ‌న్ల‌కు మొద‌ట్లో బాగానే డ‌బ్బులిచ్చారు. ఆ త‌రువాత‌, ఖ‌రీఫ్ సీజ‌న్లో ఆల‌స్యంగా నిధులు విడుద‌ల చేశారు. ర‌బీ సీజ‌న్ చివ‌రికి వ‌చ్చింద‌న‌గా అప్పుడు రైతులు ఖాతాల్లో డ‌బ్బులేశారు. అందులోనూ 10 ఎక‌రాల కంటే ఎక్కువ ఉన్న రైతుల‌కి ఈసారి నిధులు ఇవ్వ‌లేదు! అవి ఎప్పుడు ఇస్తారో కూడా ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ఆల‌స్యంగా పాస్ బుక్ లు అందుకున్న రైతుల‌కు రైతుబంధు ఇస్తారో లేదో తెలీదు. ఇక‌, భూముల్ని అమ్ముకున్న‌వారు, మ‌ర‌ణించిన రైతులు పేరుతో చాలామందిని ఈ ప‌థ‌కం నుంచి తొల‌గించారు. రైతు బీమా అంద‌రికీ వ‌ర్తింప‌జేయ‌డం లేద‌నీ, ప్ర‌భుత్వం వైఖ‌రి చూస్తుంటే రైతుబంధును ఉంచుతారా తీసేస్తారా అనే అనుమానం క‌లుగుతోంద‌ని రైతు సంఘాల నేత‌లు అంటున్నారు. ఈ ప‌రిస్థితుల‌ను నేప‌థ్యంగా చేసుకుని రేవంత్ రెడ్డి ఉద్య‌మిస్తే రైతాంగం నుంచి మంచి మద్ద‌తు ల‌భించే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close