ఏపీని మోడీ మోసం చేస్తున్నా జగన్, పవన్ ఎందుకు మాట్లాడరు: చంద్రబాబు

ఏపీ విషయంలో కేంద్ర ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరుపై… ప్రతిపక్ష నేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పూర్తి స్థాయిలో స్పందించడానికి వెనుకాడుతూండటాన్ని చంద్రబాబు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. వారిద్దర్నీ బీజేపీతో ముడిపెట్టి విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో ప్రత్యేకహోదా, విభజన హామీలు సహా.,. ఏ విషయంలోనూ వారు… కేంద్రంపై నోరెత్తిన సందర్భం లేదు. తాజాగా వెనుకబడిన జిల్లాలకు తెలంగాణకు నిధులు ఇచ్చి.. ఏపీకి ఇవ్వకపోవడాన్ని కూడా… వీరు ప్రశ్నించలేకపోయారు. దీంతో చంద్రబాబు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ వారిని కార్నర్ చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం చేస్తున్నా.. ప్రతిపక్షాలు ఎందుకు నోరు మెదపడం లేదని.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వడాన్ని ఆహ్వానిస్తున్నా .. ఏపీకి నిధులు ఎందుకివ్వరని కేంద్రాన్ని నిలదీస్తున్నానన్నారు. ఏపీపై కేంద్రం దాడి చేస్తోంది .. ఒకేసారి 19 ఐటీ బృందాలతో తనిఖీలు చేయించిందని మండిపడ్డారు. మీ బెదిరింపులకు దడుసుకునేది లేదు, ఎంతటి పోరాటానికైనా సిద్ధం కేంద్రానికి అల్టిమేటం జార చేశారు. టీడీపీ అధికారంలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి అవుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లాలో భైరవానితిప్ప ప్రాజెక్ట్ శంకుస్థాపనలో సీఎం దూకుడుగా విమర్శలలు చేశారు.

ఎన్డీఏ ప్రభుత్వం ధర్మ పోరాటం చేస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చాక… బీజేపీపై పవన్‌, జగన్‌ ఒక్క మాట కూడా మాట్లాడలేదని చంద్రబాబు గుర్తు చేశారు. ఇతర పార్టీలతో లోపాయికారి ఒప్పందంతో టీడీపీని దెబ్బతీయాలని చూశారని ఆరోపించారు. ఏపీలో ఇంత దివాలాకోరు ప్రతిపక్షాన్ని ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. నీరిస్తామంటే వద్దనే ప్రతిపక్షాన్ని ఇప్పుడే చూస్తున్నామని మండిపడ్డారు. గండికోటకు నీరొస్తే పుట్టగతులుండవని అడ్డుపడుతున్నారు… అయినా గండికోటకు 12.5టీఎంసీల నీరు తీసుకొచ్చామని గుర్తు చేశారు. పులివెందులకు నీరిచ్చిన తర్వాతే… కుప్పంకు నీరు తీసుకెళ్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నానన్నారు. కరువు జిల్లా అనంతపురానికి కియా సంస్థ వచ్చింది.. శ్రీకృష్ణ దేవరాయలు ఎప్పుడో నిర్మించిన చెరువులకు… తాను నీళ్లు రప్పించానని సంతోషం వ్యక్తం చేశారు. పట్టిసీమ పూర్తయితే రాజకీయ సన్యాసం చేస్తామని కొంత మంది నేతలు ప్రకటించారని… పట్టిసీమ పూర్తయిన తర్వాత తోక జాడించారన్నారు. ఏపీలో 47 ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యత తమదేనన్నారు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close