ఓట్లేమైపోయాయ‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం లేద‌న్న చంద్ర‌బాబు!

తెలుగుదేశం కార్య‌కర్త‌ల‌పై దాడులు చేస్తున్నార‌నీ, దారుణంగా చంపే ప‌రిస్థితి కూడా వ‌స్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు. అనంత‌పురం జిల్లాలో ఆయ‌న ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… గ‌తంలో తాము అధికారంలో ఉన్న‌ప్పుడు ప‌రిస్థితి ఇలానే ఉండేదా, ఉంటే ఇవాళ్ల వైకాపా ఎక్క‌డ ఉండేద‌ని ప్ర‌శ్నించారు. వృద్ధాప్య పింఛెనుని రెండువేల పైచిలుకు తాను పెంచాన‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్పుకుంటున్నార‌నీ, కానీ.. దాన్ని వెయ్యి నుంచి రెండు వేలు చేసింది గ‌త టీడీపీ ప్ర‌భుత్వమే కాదా అన్నారు.

ఈ స‌భ‌లో కూడా ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై మ‌రోసారి మాట్లాడారు చంద్ర‌బాబు. అంద‌రం ఓట్లేశామ‌ని ప్ర‌జ‌లు చెబుతున్నార‌నీ, తాము వేసిన ఓట్లు ఎటు వెళ్లిపోయాయ‌నే ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌నీ, ఆ ప్ర‌శ్న‌కు ఇప్ప‌టికీ త‌న ద‌గ్గ‌ర కూడా స‌మాధానం లేద‌న్నారు. త‌న‌కు ఒక్కోసారి అనుమానం క‌లుగుతోంద‌నీ, కుటుంబాన్ని వ‌దులుకుని రాష్ట్రం కోసం తాను చాలా క‌ష్ట‌ప‌డ్డాన‌నీ, రోడ్లు వేశాన‌నీ మ‌రుగుదొడ్లు క‌ట్టించాన‌నీ వీధి దీపాలు అన్నీ పెట్టించా అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కావాల‌ని రాత్రింబవ‌ళ్లూ క‌ష్ట‌ప‌డ్డాన‌నీ, ఇక్క‌డికి కియా మోటార్స్ కూడా తీసుకొచ్చాన‌నీ, అయితే చివ‌రికి ఆ సీటు కూడా గెల‌వ‌లేద‌నీ, దీన్ని ఏమ‌నాలో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌న్నారు! క‌ష్ట‌ప‌డ‌ట‌మే నేను చేసిన త‌ప్పా అని అన్నారు.

ఎన్నిక‌లైపోయాయి, ప్ర‌జాతీర్పు వ‌చ్చేసింది. ఇప్పుడు.. ఓట్లేమైపోయాయీ అని వేదిక‌ల మీద వ్యాఖ్యానాలు చేయ‌డం స‌రైంది కాద‌నే అభిప్రాయ‌మే వ్య‌క్త‌మౌతోంది. త‌న‌కీ అనుమానాలున్నాయంటే, వేరే మార్గాల ద్వారా వాటిపై నివృత్తి చేసుకోవాలి. ఎన్నిక‌ల ముందు ఈవీఎంల ప‌నితీరుపై అనుమానాలున్నాయ‌న్నారు. ఆ విష‌యాన్నే ప‌రోక్షంగా చంద్ర‌బాబు గుర్తు చేసే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టున్నారు. ఇప్పుడీ చ‌ర్చ వ‌ల్ల పార్టీకి ఏర‌కంగానూ ఉప‌యోగం ఉండ‌దు. ఇంకోటి… నేను చేసిన త‌ప్పేంటి అని ప్ర‌తీచోటా మాట్లాడుతూ ఉంటే… ఇంకా ఓట‌మి భారం నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చిన‌ట్టుగా లేర‌నీ, ప్ర‌తిప‌క్ష పార్టీ పాత్ర‌లోకి టీడీపీ వ‌చ్చిన‌ట్టుగా లేద‌నే సంకేతాలు వెళ్తాయి. కొత్త ప్ర‌భుత్వం పూర్తిగా పాల‌న మోడ్ లోకి వ‌చ్చేసింది. కాబ‌ట్టి, దానికి అనుగుణంగా టీడీపీ కార్యాచ‌ర‌ణ ఉన్న‌ట్టు ప్రొజెక్ట్ అవ్వాలి. కార్య‌కర్త‌ల‌పై దాడుల మీద పోరాటం చేయాల్సిందే. కానీ, ఇంకా ఓట్లేమైపోయాయో అని మాట్లాడుతుంటే… ప‌రోక్షంగా ప్ర‌జాతీర్పును ప్ర‌శ్నిస్తున్న సంకేతాలే రానురానూ ప్ర‌జ‌ల్లోకి వెళ్లే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close