వ‌ల‌స నేత‌ల‌కు చిన‌రాజ‌ప్ప ప‌రోక్ష ఆహ్వానం..!

పాద‌యాత్ర సంద‌ర్భంగా ఆరు నెల‌లపాటు వ్య‌క్తిగ‌త హాజ‌రు నుంచి మిన‌హాయింపు కావాలంటే సీబీఐ కోర్టును ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌జ‌లు స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు తాను జ‌నంలోకి వెళ్తున్నాననీ, పాద‌యాత్ర జ‌రుగుతున్న స‌మ‌యంలో విచార‌ణ నుంచి వెసులుబాటు క‌ల్పించాల‌ని జ‌గ‌న్ చేసుకున్న అభ్య‌ర్థ‌న‌ను సీబీఐ కోర్టు తోసిపుచ్చింది. దీనిపై హైకోర్టుకు వెళ్లే ఆలోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్నార‌ని తెలుస్తోంది. దీంతో అధికార పార్టీ తెలుగుదేశానికి మ‌రో బ‌ల‌మైన విమ‌ర్శ‌నాస్త్రం దొరికేసింది. ఆయ‌న పాద‌యాత్ర‌కు ప్రతీ శుక్ర‌వారం సెల‌వు పెట్టుకోవాల్సి వ‌స్తుంద‌ని తాము ముందే చెప్పామంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానాలు మొద‌లుపెట్టేశారు. ఇప్ప‌టికైనా ఆయ‌న ప్ర‌తిప‌క్ష నేత హోదా నుంచి త‌ప్పుకోవాల‌నీ, పార్టీ ప‌గ్గాల‌ను ఇత‌ర నాయ‌కుల‌కు ఇచ్చేయాలంటూ ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి విమ‌ర్శించారు. డ‌జ‌ను కేసుల్లో ఎక్యూజ్డ్ వ‌న్ గా ఉన్న నాయ‌కుడు ప్ర‌జ‌ల కోసం ఏం చేయ‌గ‌ల‌రు అంటూ ఆయ‌న ఎద్దేవా చేశారు. అయితే, ఇదే సంద‌ర్భాన్ని ఉద్దేశించి ఉప ముఖ్య‌మంత్రి చిన‌రాజ‌ప్ప కూడా స్పందించారు. ఆయ‌న మాట‌లే కాస్త ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి!

‘నంద్యాల, కాకినాడ ఎల‌క్ష‌న్ల త‌రువాత ఆ పార్టీ నాయ‌కులంతా జారిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది. కాబ‌ట్టి, పాద‌యాత్ర చేసి నేత‌ల్ని పోగేద్దామ‌ని చెప్పి ప్ర‌య‌త్నించారు. కానీ, శుక్ర‌వారం నాడు కోర్టు అడ్డు వ‌చ్చింది. దాని తప్పించుకోవడం కోస‌మే కోర్టుకు వెళ్తే.. నువ్వు పాద‌యాత్ర‌లు చేయాల్సిన అవ‌స‌రం లేదూ, కోర్టు అటెండ్ కావాల్సిందే అని చెప్పింది’ అంటూ చిన‌రాజ‌ప్ప వ్యాఖ్యానించారు. పాద‌యాత్ర‌కు ప్ర‌తీ శుక్ర‌వారం సెల‌వు ఉంటాద‌ని తాము కూడా గ‌తంలో చెప్పామ‌న్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర చేసినా చేయ‌క‌పోయినా.. ఏపీ ప్రజలే కాదు, వైకాపా నాయ‌కులు కూడా ఆయ‌న్ని న‌మ్మే ప‌రిస్థితి లేద‌న్నారు. నాయ‌కులంతా జారుకునే స్థితిలో ఉన్నార‌ని రాజ‌ప్ప జోస్యం చెప్పారు. ఇప్ప‌టికైనా ఆయ‌న క‌ళ్లు తెర‌వాల‌నీ, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్ర‌య‌త్నాలు మానుకుని స‌హ‌క‌రించాల‌ని స్ప‌ష్టం చేశారు.

వైకాపా నుంచి పెద్ద ఎత్తున వ‌ల‌స‌ల‌కు రాజ‌ప్ప మ‌రోసారి ప‌రోక్షంగా ఆహ్వానం ప‌లుకుతున్న‌ట్టుగా ఉంది! ఎలాగూ జ‌గ‌న్ పాద‌యాత్ర సంద‌ర్భంగా కొన్ని వ‌ల‌స‌ల్ని ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నారు. ఎంపీ బుట్టా రేణుక, అనంతపురానికి చెందిన కొద్దిమంది నేతలూ.. వీరంతా పచ్చ కండువా కోసం లైన్లో ఉన్నవారే కదా. ఇప్పుడు కోర్టు తీర్పు కూడా జ‌గ‌న్ కి ప్ర‌తికూలంగా ఉండేస‌రికి… ఈ ప‌రిస్థితిని మ‌రింత అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ సిద్ధ‌మౌతున్న‌ట్టుగా రాజప్ప వ్యాఖ్య‌ల్ని బ‌ట్టీ చెప్పొచ్చు. ఇప్ప‌టికే వైకాపాలోని ప్ర‌ముఖుల్ని టీడీపీలోకి చేర్చుకున్నారు. ఇక మిగిలిన నేత‌లు, ఎటూ తేల్చుకోలేక ఊగిస‌లాడే నాయ‌కుల‌కు టీడీపీ మ‌రింత విశాలంగా ద్వారాలు తెరిచి పెట్టింద‌నే సంకేతాలు పంపుతున్నట్టుగా ఉంది!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close