ఆమంచి ఎఫెక్ట్‌… చీరాల వైకాపా ఇన్ ఛార్జ్ అల‌క‌!

టీడీపీని వ‌దిలి ఆమంచి కృష్ణ‌మోహ‌న్ వైకాపాలో చేరిన సంగ‌తి తెలిసిందే. టీడీపీలో ఆయ‌న‌కి ఈసారి సీటు ద‌క్క‌డం కాస్త అనుమాన‌మే అనే ప్ర‌చారం ఉన్న నేప‌థ్యంలో ఆమంచి పార్టీ మారిపోయారు. వాస్త‌వానికి, ఆయ‌న టీడీపీ నుంచి సీటు ద‌క్కించుకున్నా… పార్టీలోని ఒక వ‌ర్గం ఆయ‌న్ని ఓడిస్తుంద‌నే ప్ర‌చార‌మూ ఉంది. దీంతో వైకాపా నుంచి బ‌రిలోకి దిగితే బాగుంటుంద‌ని ఆయ‌న భావించారు. కానీ, అక్కడ కూడా ఆమంచికి చుక్కెదుర‌య్యే ప‌రిస్థితే క‌నిపిస్తోంది. ఆమంచి వైకాపాలో చేరిక‌పై స్థానిక నేత‌లు గుర్రుగా ఉన్నారు. ఆమంచిని పార్టీలో చేర్చుకోవ‌డం తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంద‌నీ, ఈ నిర్ణ‌యంపై మ‌రోసారి ఆలోచించాలంటూ చీరాల వైకాపా ఇన్ ఛార్జ్ ఎడం బాలాజీ అన్నారు.

ఆమంచిని పార్టీలో చేర్చుకునేముందు స్థానిక వైకాపా కార్య‌క‌ర్త‌ల అభిప్రాయాలు తీసుకోలేద‌నీ, క‌నీసం త‌న‌కైనా ఒక మాట‌గా జ‌గ‌న్ చెప్ప‌లేదంటూ బాలాజీ అభిప్రాయ‌ప‌డ్డారు. పార్టీకి సేవ చేయ‌డం కోసం విదేశాల్లో ఉన్న వ్యాపారాల‌ను తాను వ‌దులుకుని వ‌చ్చాన‌నీ, ఇన్నాళ్లూ పార్టీని న‌మ్ముకుని ఉన్నందుకు జ‌గ‌న్ త‌న‌కు స‌రైన బ‌హుమాన‌మే ఇచ్చారంటూ బాలాజీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌త తొమ్మిదేళ్లుగా ఆమంచి ఆకృత్యాల‌పై పోరాటం సాగించాన‌న్నారు. అంతేకాదు, అప్ప‌ట్లో ఆమంచిని జ‌గ‌న్ ఎదుర్కొన‌లేక‌పోయార‌నీ, అందుకే త‌న‌ను పార్టీలోకి పిలిచార‌నే విష‌యాన్ని జ‌గ‌న్ ఒక్క‌సారి గుర్తు చేసుకోవాల‌న్నారు.

ఆమంచి చేరిక విష‌యంలో స‌మ‌గ్ర‌మైన చ‌ర్చ జ‌ర‌గాల‌నీ, త‌న ప్ర‌శ్న‌ల‌కు జ‌గ‌న్ వెంట‌నే స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. తాను పంపుతున్న లేఖ‌కు జ‌గ‌న్ స్పందించ‌క‌పోతే పార్టీకి రాజీనామా చేయ‌డానికి కూడా వెన‌కాడ‌న‌న్నారు బాలాజీ. అంతేకాదు, త‌న‌ను కాద‌ని ఆమంచికి టిక్కెట్ ఇచ్చినా… ఆయ‌న్ని క‌చ్చితంగా ఓడించి తీర‌తాన‌ని కూడా ఆయ‌న అన్నారు. ఇదీ ఆమంచి చేరిక ఎఫెక్ట్‌. టీడీపీ మీద పోరాటం చేస్తానంటూ వైకాపాలో చేరిన వెంట‌నే ఆమంచి స‌వాళ్లు చేశారు. కానీ, ఇప్పుడు సొంత పార్టీ వైకాపా నేత‌ల నుంచే తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మౌతోంది. పార్టీ మారడం ద్వారా వ్య‌తిరేకుల సంఖ్య‌ను రెండింత‌లు చేసుకున్న‌ట్టుగా ఉంది! ఇక్క‌డో మ‌రో అంశం గ‌మ‌నించాలి. అదేంటంటే…. పార్టీని న‌మ్ముకుని ప‌నిచేస్తున్న‌వారి అభిప్రాయాల‌ను జ‌గ‌న్ పెద్ద‌గా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోర‌నేది! ఎప్ప‌ట్నుంచో పార్టీని న‌మ్ముకున్న‌వారికే ప్రాధాన్య‌త లేక‌పోతే, కొత్త‌గా వ‌చ్చిన వ‌ల‌స ప‌క్షుల‌కు గుర్తింపు ఎక్క‌డ ఉంటుంది..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close