మెగాస్టార్ చిరంజీవి దగ్గర ఓ మంచి అలవాటు ఉంది. తనకు దగ్గరైన వాళ్లకు మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తుంటారాయన. ఇప్పుడు అనిల్ రావిపూడికి కూడా ఓ ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఈ సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకొన్న సంగతి తెలిసిందే. రీజనల్ మూవీస్ లో ఇదే ఆల్ టైమ్ హిట్. చిరు కమ్ బ్యాక్ తరవాత కమర్షియల్ గా ఇంత పెద్ద విజయాన్ని అందుకోవడం ఇదే తొలిసారి. దాంతో.. తన దర్శకుడు అనిల్ రావిపూడికి మర్చిపోలేని బహుమతి ఇచ్చారు. ఖరీదైన కారుని అందించారు. ఈ కారు ఖరీదు దాదాపు 2.5 కోట్లు.
అనిల్ రావిపూడికి బహుమానాలు ఇవ్వడం చిరుకి ఇదే తొలిసారి కాదు. ఇది వరకు ఓ ఖరీదైన రిస్ట్ వాచ్ అందించారు. ఇప్పుడు కారు. ఈరోజు హైదరాబాద్ లో `మన శంకర వర ప్రసాద్ గారు` గ్రాండ్ సక్సెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా కారు తాళాలు అనిల్ రావిపూడి చేతికి అందించారు చిరు. ఈ సినిమా హిట్టయితే.. నిర్మాత సాహు గారపాటి కూడా అనిల్ రావిపూడికి ఓ మంచి బహుమతి ఇస్తానని ఇది వరకే ప్రకటించారు. అనిల్ రావిపూడి అయితే.. తనకు ఫామ్ హౌస్ కొనివ్వాలని ఓ ప్రెస్ మీట్ లో స్వయంగా అడిగారు. సో… త్వరలోనే అనిల్ రావిపూడికి ఫౌమ్ హౌస్ డాక్యుమెంట్లు కూడా అందుతాయేమో చూడాలి.
