రేపిస్ట్ కి ఉరి శిక్ష – చిత్తూరు జిల్లా జడ్జి తీర్పు ..!

ఆంధ్రప్రదేశ్‌లో మరో కిరాతకుడిగా ఉరి శిక్ష విధించారు. ఆరేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన రఫీ అనే వ్యక్తికి చిత్తూరు మొదటి అదనపు జిల్లా జడ్జి ఉరిశిక్ష విధించారు. ఫోక్సో చట్టంతో కేసు నమోదు చేసిన వంద రోజుల్లో తీర్పు వెలువడింది. గత ఏడాది నవంబర్ 7వ తేదీ మదనపల్లిలో ఓ కళ్యాణమండపంలో జరిగే తమ బంధువుల పెళ్లికి.. సిద్దారెడ్డి,ఉషారాణి తమ ఆరేళ్ళ చిన్నారితో కలసి వచ్చారు. బోజనాలు తర్వాత పాప కనిపించకుండా పోయింది. అక్కడే ఉన్న మహమ్మద్ రఫీ తన సెల్ ఫోన్‌తో పోటోలు తీస్తూ పాపకు మాయమాటలు చెప్పి కల్యాణమండపం వెనుకకు తీసుకెళ్లాడు. అత్యాచారం చేసి ఆపై హత్యచేసి అక్కడే పడేసి పరారయ్యాడు.

కల్యాణమండపంలోని సి.సి పుటేజ్ ఆధారంగా లారీ క్లీనర్ రఫీ నిందితుడని గుర్తించారు. తర్వాతి రోజే..ఎవరూ గుర్తు పట్టకుండా గుండు చేయించుకుని చత్తీస్ ఘడ్ వెళ్లిపోయాడు. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకు వచ్చారు. పోస్టు మార్టం రిపోర్టు, ఎఫ్.ఎస్.ఎల్ నివేదికలు వంటి కీలక సాక్ష్యాలతో పోలీసులు 17 రోజుల్లోనే చార్జ్ షీట్ దాఖలు చేశారు. 100 రోజుల్లోనే తీర్పు వెలువడింది. నిందితుడికి ఉరిశిక్షను ఖరారు చేసిన న్యాయమూర్తి.. అమలు తేదీని హైకోర్టు నిర్ణయిస్తుందన్నారు. నెల్లూరులో దంపతుల్ని హత్య చేసిన వ్యక్తికి.. కొద్ది రోజల కిందట… ఉరి శిక్షను కోర్టు ప్రకటించింది.

అలాగే.. తెలంగాణలో సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డికి ఉరి శిక్షను అక్కడి కోర్టు ప్రకటించింది. అయితే.. వీటి అమలు ఎప్పుడన్నదానిపై… స్పష్టత లేదు. దోషులకు ఉన్న న్యాయపరమైన అవకాశాలన్నీ వినియోగించుకునేసరికి.. ఏళ్లూ..పూళ్లూ పడుతుందని.. నిర్భయ కేసు దోషుల వ్యవహారంతోనే తేలిపోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close